English | Telugu
తారక్ తో కృష్ణవంశీ `రైతు`?
Updated : Aug 12, 2021
`రైతు`.. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డ్రీమ్ ప్రాజెక్ట్. ఒక దశలో ఈ సినిమాని నటసింహం నందమూరి బాలకృష్ణతో చేయాలనుకున్నాడాయన. అయితే, కొన్ని కారణాల వల్ల సదరు ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. కట్ చేస్తే.. ఇప్పుడిదే సబ్జెక్ట్ ని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలని ప్లాన్ చేస్తున్నాడట ఈ స్టార్ డైరెక్టర్. ఈ మేరకు సంప్రదింపులు కూడా జరుగుతున్నాయని టాక్. ఇదివరకు కృష్ణవంశీ దర్శకత్వంలో `రాఖీ`(2006) చిత్రం చేశాడు తారక్. ఆ సినిమా నటుడిగా ఎన్టీఆర్ కి మంచి గుర్తింపుని తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో.. కృష్ణవంశీతో మరోసారి పనిచేయడానికి తారక్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో అన్నది ఆసక్తికరంగా మారింది.
కాగా, ప్రస్తుతం `ఆర్ ఆర్ ఆర్`ని పూర్తిచేసే పనిలో ఉన్నాడు ఎన్టీఆర్. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ పిరియడ్ డ్రామా అక్టోబర్ 13న థియేటర్స్ లో సందడి చేయనుంది. ఆపై కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మరో చిత్రం చేయబోతున్నాడు తారక్. వాటి తరువాత త్రివిక్రమ్ తో ఓ ప్రాజెక్ట్ చేస్తాడని బజ్. వాటి తరువాతే కృష్ణవంశీ కాంబినేషన్ మూవీ చేసే అవకాశముందంటున్నారు. ఇక కృష్ణవంశీ విషయానికి వస్తే.. తన తాజా చిత్రం `రంగమార్తండ` విడుదలకు సిద్ధమైంది.