English | Telugu
మెగాస్టార్ తో శ్రుతి హాసన్ రొమాన్స్.. సేమ్ రోల్?
Updated : Aug 16, 2021
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. ఇలా మెగా కాంపౌండ్ లో ముగ్గురు స్టార్స్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది శ్రుతి హాసన్. ముగ్గురితోనూ విజయాలు చూసింది. కట్ చేస్తే.. త్వరలో ఈ మల్టిటాలెంటెడ్ యాక్ట్రస్ మెగాస్టార్ చిరంజీవితో జోడీ కట్టనుందట.
ఆ వివరాల్లోకి వెళితే.. తమిళనాట మంచి విజయం సాధించిన `వేదాళం`(2015) చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అజిత్ పోషించిన పాత్రలో చిరు నటిస్తుండగా.. లక్ష్మీ మీనన్ యాక్ట్ చేసిన చెల్లెలి తరహా పాత్రలో కీర్తి సురేశ్ దర్శనమివ్వనుందని సమాచారం. కాగా, మాతృకలో అజిత్ కి జోడీగా ఫేక్ లాయర్ గా నటించిన శ్రుతి హాసన్.. రీమేక్ లోనూ అదే పాత్రలో నటించబోతోందని వినికిడి. ఇప్పటికే ఈ మేరకు శ్రుతితో దర్శకుడు మెహర్ రమేశ్ సంప్రదింపులు కూడా చేశారని టాక్. త్వరలోనే `వేదాళమ్` రీమేక్ లో శ్రుతి ఎంట్రీపై క్లారిటీ రానుంది. మరి.. మెగాస్టార్ కాంబినేషన్ లోనూ శ్రుతి సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి.
కాగా, `క్రాక్`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసిన శ్రుతి ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన పాన్ - ఇండియా మూవీ `సలార్` చేస్తోంది. 2022 ఏప్రిల్ 14న ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది.