బాప్రే.. 'జాతిరత్నాలు' డైరెక్టర్ సినిమాకు శివకార్తికేయన్ రెమ్యూనరేషన్ 25 కోట్లా?
శివకార్తికేయన్ మార్కెట్ తమిళనాట రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల అతను ఒక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి సంతకం చేశాడు. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా అనుదీప్ కె.వి. డైరెక్ట్ చేసిన ఫిల్మ్ 'జాతిరత్నాలు'. కేవలం రూ. 4 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఆ సినిమా సెన్సేషనల్ హిట్టయి, రూ. 60 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.