చిరు చిత్రంలో చియాన్ విక్రమ్?
చియాన్ విక్రమ్ పేరు చెప్పగానే తమిళ అనువాద చిత్రాలు `శివపుత్రుడు`, `అపరిచితుడు` కళ్ళముందు కదలాడతాయి. అయితే, వాటికంటే ముందే విక్రమ్ కొన్ని తెలుగు సినిమాలు చేశాడు. `బంగారు కుటుంబం`, `ఊహా`, `ఆడాళ్ళా మజాకా`, `అక్కా బాగున్నావా`, `మెరుపు`, `కుర్రాళ్ళ రాజ్యం`, `9 నెలలు`.. ఇలా అరడజనుకి పైగా తెలుగు చిత్రాల్లో సందడి చేశాడు విక్రమ్. కట్ చేస్తే.. దాదాపు రెండు దశాబ్దాల తరువాత ఓ స్ట్రయిట్ తెలుగు పిక్చర్ లో నటించడానికి విక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని బజ్...