ప్రభాస్ 25.. ఆ రోజే ముహూర్తం?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం `రాధే శ్యామ్`, `సలార్`, `ఆది పురుష్`, `ప్రాజెక్ట్ కే` చిత్రాలున్నాయి. వీటిలో `రాధే శ్యామ్`, `సలార్`, `ఆది పురుష్` వచ్చే ఏడాది తెరపైకి రానుండగా.. `ప్రాజెక్ట్ కే` 2023లో థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇదిలా ఉంటే.. ప్రభాస్ తన 25వ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్ లో చేయబోతున్నట్లు గత కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.