English | Telugu

అల్లు అర్జున్‌తో అన‌న్య రొమాన్స్?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం `పుష్ప‌`తో బిజీగా ఉన్నారు. బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో నెవ‌ర్ సీన్ బిఫోర్ రోల్ లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు బ‌న్నీ. రెండు భాగాలుగా తెర‌కెక్కుతున్న ఈ పాన్ - ఇండియా మూవీ తాలూకు ఫ‌స్ట్ పార్ట్ (పుష్ప - ద రైజ్).. ఈ ఏడాది క్రిస్మ‌స్ స్పెష‌ల్ గా రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే.. `పుష్ప‌`లో క‌న్న‌డ క‌స్తూరి ర‌ష్మిక మంద‌న్న‌తో రొమాన్స్ చేస్తున్న అల్లు అర్జున్.. నెక్స్ట్ వెంచ‌ర్ లో బాలీవుడ్ బ్యూటీతో జోడీ క‌ట్ట‌నున్నార‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. `వ‌కీల్ సాబ్` ఫేమ్ వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ హీరోగా `ఐకాన్` పేరుతో ఓ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాయిక‌గా ఉత్త‌రాది భామ అన‌న్యా పాండేని న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని టాక్. త్వ‌ర‌లోనే `ఐకాన్`లో అన‌న్య ఎంట్రీపై క్లారిటీ రానుంది.

కాగా, అన‌న్య ప్ర‌స్తుతం `లైగ‌ర్` చిత్రంలో న‌టిస్తోంది. యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ పాన్ - ఇండియా మూవీని డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ రూపొందిస్తున్నారు. ఈ ఏడాది చివ‌ర‌లో ఈ స్పోర్ట్స్ డ్రామా థియేట‌ర్స్ లో సంద‌డి చేసే అవ‌కాశ‌ముంది.