ధనుష్ దర్శకత్వంలో రజినీకాంత్!!
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం 'అన్నాత్తే' చిత్రంలో నటిస్తున్నారు. రజినీ 168వ చిత్రంగా తెరకెక్కుతోన్న దీనికి శివ దర్శకత్వం వహిస్తుండగా.. నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ మూవీ తర్వాత రజినీ నటనకు స్వస్తి పలకబోతున్నారని ఇటీవల వార్తలొచ్చాయి.