English | Telugu

ర‌జినీకాంత్ సినిమాలో శ‌ర్వానంద్‌..!

కోలీవుడ్ సూప‌ర్ స్టార్ రజినీకాంత్ రాబోయే సినిమాల‌పై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ క్రియేట్ అయ్యాయి. అందుకు కార‌ణం రీసెంట్‌గా రిలీజైన ‘జైలర్’ సినిమానే. ఆ మూవీ విడుద‌లైన ఆరు రోజుల‌కే రూ. 400 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా ఏకంగా రూ.70 కోట్ల లాభాల‌తో ర‌న్ అవుతోంది. ఇంకా హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్స్ వ‌స్తుండ‌టం చూస్తే సినిమా రూ.500 కోట్ల‌ను సుల‌వుగానే దాటేస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి. దీంతో ర‌జినీకాంత్ అప్‌కమింగ్ మూవీస్‌పై అంచ‌నాలు పెరుగుతున్నాయి. ప్ర‌స్తుతం త‌లైవ‌ర్ రెండు సినిమాలు రాబోతున్నాయి. అందులో ఒక‌టి లాల్ స‌లాం. ఇందులో ర‌జినీ కీల‌క పాత్ర‌లో మాత్ర‌మే క‌నిపించ‌నున్నారు. ఇక మ‌రో సినిమా విష‌యానికి వ‌స్తే..దాన్ని ‘జై భీమ్’ ఫేమ్ టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నారు. ఇది త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

బాపు కోసం హే రామ్ విడుద‌ల చేసిన క‌మ‌ల్‌

క‌మ‌ల్ హాస‌న్ హే రామ్ సినిమా గుర్తుందా? అప్ప‌ట్లో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ సినిమాకు మాస్ట‌ర్డ్ వెర్ష‌న్ అవైల‌బుల్‌లో ఉంది యూట్యూబ్‌లో. అది కూడా ఉచితంగా అందుబాటులో ఉంది. 77వ ఇండిపెండెన్స్ డేని పుర‌స్క‌రించుకుని బాపు (మ‌హాత్మా గాంధి)కి త‌న నివాళి అంటూ ఈ విషయాన్ని షేర్ చేశారు క‌మ‌ల్‌హాస‌న్‌. హిస్టారిక‌ల్ క్రైమ్ డ్రామాగా తెర‌కెక్కించారు హే రామ్‌ని.  ఈ సినిమాకు రాసి, డైర‌క్ట్ చేసి, నిర్మించిన‌, న‌టించిన ఘ‌న‌త క‌మ‌ల్‌హాస‌న్‌ది. హే రామ్‌లో సాకేత్ రామ్‌గా న‌టించారు క‌మ‌ల్ హాస‌న్‌. మ‌హాత్మా గాంధీని అసాసినేట్ చేస్తూ పోయే కేర‌క్ట‌ర్ అత‌నిది. చివ‌రికి ఏమైంది?  నాథూరామ్ గాడ్సే గురించి సినిమాలో ఏం చెప్పారు?  వంటివ‌న్నీ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు.

సామ్ కోసం చిన్మయి సాంగ్...ఐ లవ్ యు అంటూ హగ్

సమంత అంటే చాలామందికి ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్. ఆమె బోల్డ్ నెస్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఎలాంటి కఠినమైన పరిస్థితి ఉన్నా తట్టుకుని పైకి వచ్చే సత్తా సమంతలో ఉంది. అలాంటి సమంత విజయ్ దేవరకొండతో కలిసి "ఖుషి" మూవీలో నటించింది. త్వరలో అది రిలీజ్ కాబోతోంది. ఆ మూవీ ప్రొమోషన్స్ మంచి జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్స్ లో చిన్మయి సమంత గురించి చాలా పొగిడేసింది. "సామ్ నీకు ఈ విషయం గురించి చెప్పాలనుకుంటున్నా...తెలుగులో నా డబ్బింగ్ కెరీర్ స్టార్ట్ అయ్యింది మీ వల్లే. నువ్వు ఎంతోమంది అబ్బాయిలకు, అమ్మాయిలకు ఇన్స్పిరేషన్ , నువ్వు ఎంతోమందికి హీరోవి. సమంత చాలా నైస్ పర్సన్, ది బెస్ట్, ది బ్రేవెస్ట్ పర్సన్, ది బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ ని ఈ ప్రపంచంలో నేను ఇంతవరకు చూడలేదు.

విజయ్ బెటర్ హాఫ్ లో ఉండాల్సిన క్వాలిటీ ఇదే అని చెప్పిన సామ్

విజయ్ దేవరకొండ, సమంత నటించిన "ఖుషి" మూవీ త్వరలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో యూట్యూబర్, ఆర్టిస్ట్ నిఖిల్ విజయేంద్ర సింహ ఈ ఇద్దరితో కలిసి చిన్న చిట్ చాట్ నడిపించాడు. అందులో ఒకరి గురించి ఒకరికి ప్రశ్నలు వేసాడు. అదేంటో చూద్దాం. "సమంతా నిక్ నేమ్" ఏంటి అని విజయ్ దేవరకొండని అడిగాడు నిఖిల్ వియాయేంద్ర సింహ. "సామ్" అని చెప్పాడు. "సమంతాస్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు" మేఘన" అని కరెక్ట్ గా చెప్పాడు. "సమంతకు ఇష్టమైన ఫుడ్ ఏమిటి" అనేసరికి "ఫుడ్ ఏదైనా ఎంజాయ్ చేస్తుంది" అని చెప్పాడు. "సమంతకి పిచ్చ కోపం వచ్చినప్పుడు ఫస్ట్ వాడే మాట ఏమిటి" " అంత బాడ్ లాంగ్వేజ్ ఉండదు సామ్ కి" అని చెప్పాడు కానీ సామ్ మాత్రం "నీ" అంటాను ముందు అని చెప్పింది.

‘సలార్’ మేకర్స్‌పై ఫ్యాన్స్ గుర్రు

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ రిలీజ్‌కి సిద్ధం చేస్తోన్న పాన్ ఇండియాల లిస్టు పెద్ద‌గానే ఉంది. ఈ ఏడాది ఇప్ప‌టికే ఆయ‌న ఆదిపురుష్ సినిమాతో థియేట‌ర్స్‌లోకి వ‌చ్చారు. ఇప్పుడు ఆయ‌న అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న సినిమాల్లో ‘సలార్’ ఉంది. సెప్టెంబ‌ర్ 28న పాన్ ఇండియా మూవీగా వ‌ర‌ల్డ్ వైడ్ సినిమాను రిలీజ్ చేస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించేశారు. విడుద‌ల‌కు యాబై రోజులు కూడా లేదు. అయితే సినిమాను నిర్మిస్తోన్న హోంబలే ఫిలింస్ కొన్ని పోస్ట‌ర్స్‌, రీసెంట్‌గా రిలీజ్ చేసిన గ్లింప్స్ మిన‌హా ఏమీ లేదు. ఇంకా ‘సలార్’ నుంచి పాట‌లు రావాల్సి ఉంది. టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఉంది. వీటితో పాటు ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ చేయాల్సి ఉన్నాయి. ఇంత ప‌ని ఉన్నప్ప‌టికీ మేక‌ర్స్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు.

చెప్పుతో కొడ‌తా... మోహ‌న్ బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సీనియ‌ర్ న‌టుడు, నిర్మాత మోహ‌న్ బాబు తన విశ్వ విద్యాల‌యంలో 77వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న శ్రీకాళ‌హ‌స్తికి స‌మీపంలో ఉండే త‌న స్వ‌గ్రామం మోదుగుల పాలెం వ‌చ్చారు. అక్క‌డ గ్రామ‌స్థుల‌తో స‌ర‌దాగా గ‌డిపారు. మొక్క‌ల‌ను నాటారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న కుల వివ‌క్ష‌పై చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. ‘‘ఒక‌ప్పుడు కూడా మ‌న ద‌గ్గ‌ర కుల వ్య‌వ‌స్థ ఉండేది. అయినా అత్త‌, మామ‌, అక్క‌, బావ అంటూ పిలుచుకునేవారు.. స‌ర‌దాగా క‌లిసి మెలిసి ఉండేవారు. నా చిన్న‌త‌నంలో నాతోటి వ్య‌క్తిని మ‌రొక‌త‌ను అంట‌రానివాడంటూ దూషిస్తే.. చెప్పుతో కొడ‌తాన‌ని అన్నాను.అప్ప‌టితో పోల్చితే ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి. కులం పేరుతో దూషిస్తున్నారు. అస‌లు ఈ కులాల‌నో ఎవ‌రు క‌నిపెట్టారో తెలియ‌టం లేదు. నాకు కులాలంటే అస‌హ్యం’’ అన్నారు మోహ‌న్ బాబు.

ద‌ళ‌ప‌తి మూవీతో ధోనీ డెబ్యూ

ప్ర‌ముఖ క్రికెట‌ర్ ధోనీ సిల్వ‌ర్ స్క్రీన్ డెబ్యూ గురించి చాలా కాలంగా ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్నాయి. ఆ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు సంత‌కం చేశారంటూ ర‌క‌ర‌కాల వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. ఇటీవ‌ల త‌న ప్రొడ‌క్ష‌న్ హౌస్ లో తెర‌కెక్కించిన సినిమాలోనూ ఆయ‌న ఓ స్పెష‌ల్ కేర‌క్ట‌ర్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఎల్‌జీఎం సినిమాలో క‌చ్చితంగా ధోనీ న‌టించార‌ని క‌న్‌ఫ‌ర్మ్ గా చెప్పిన వారు కూడా లేక‌పోలేదు. అయితే అవ‌న్నీ త‌ప్పుడు వార్త‌లేన‌ని తేలింది. లేటెస్ట్ గా ధోనీ సిల్వ‌ర్ స్క్రీన్ ఎంట్రీ గురించి మ‌రో న్యూస్ వైర‌ల్ అవుతోంది. వెంక‌ట్ ప్ర‌భు డైర‌క్ష‌న్‌లో సినిమా చేయ‌డానికి ధోనీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు టాక్‌. ధోనీకి ద‌ళ‌ప‌తి విజ‌య్ అంటే చాలా ఇష్ట‌మ‌ట‌. అందుకే విజ‌య్ సినిమా అవ‌కాశం వ‌చ్చేస‌రికి కాద‌న‌లేక‌పోయార‌ట మిస్ట‌ర్ క్రికెట‌ర్‌. ఈ ఏడాది అక్టోబ‌ర్‌లోగానీ, న‌వంబ‌ర్‌లోగానీ సినిమా మొద‌ల‌వుతుంది. ద‌ళ‌ప‌తి విజ‌య్ ప్ర‌స్తుతం ఫారిన్ ట్రిప్‌లో ఉన్నారు. ఇటీవ‌ల లోకేష్ క‌న‌గ‌రాజ్ లియో సినిమాను కంప్లీట్ చేశారు విజ‌య్‌. ఇప్పుడు ఫారిన్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు. త్వ‌ర‌లో రాగానే వెంక‌ట్ ప్ర‌భు సినిమా మొద‌ల‌వుతుంది.