English | Telugu

నోరులేని జీవాలని కాపాడాలంటున్న సదా!

సదా అని పిలవబడే సదాఫ్ మొహమ్మద్ సయీద్.. తెలుగు సీనీ పరిశ్రమలో 'జయం' మూవీతో అరంగేట్రం చేసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అల్లరి నరేష్ తో కలిసి 'ప్రాణం' సినిమాలో నటించింది. జయం, నాగ, లీలా మహల్ సెంటర్, దొంగ-దొంగది, ఔనన్న కాదన్నా, చుక్కల్లో చంద్రుడు, వీరభద్ర, క్లాస్ మేట్స్, శంకర్ దాదా జిందాబాద్, టక్కరి, అపరిచితుడు, యమలీల 2 మొదలగు సినిమాలలో నటించిన సదా కెరీర్ లో 'జయం' మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

సదా ముంబై లో ఒక రెస్టారెంట్ ని ఓపెన్ చేసి అక్కడే తన జ్ఞాపకాలు ఉన్నాయంటూ ఈ మధ్యకాలంలో ఎమోషనల్ అవుతూ ఒక వ్లాగ్ ని చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం అందరికి తెలిసిందే. సినిమాలలో కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న సదా.. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. పలు టీవీ షోస్ లో జడ్జ్ గా చేస్తూ ఆకట్టుకుంటుంది. 'ఢీ' డాన్స్ షోకి శేఖర్ మాస్టర్ తో కలిసి జడ్జ్ గా వ్యవహరించగా వీళ్ళిద్దరి జడ్జిమెంట్ అంటే ఎంటర్‌టైన్మెంట్ కి కేరాఫ్ గా ఉంటుంది. బిబి జోడికి జడ్జిగా చేసి ఆ షోకి మరింత క్రేజ్ వచ్చేలా చేసింది సదా. అయితే సదాకి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. అంతే కాకుండా సదా సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి తన అప్డేట్స్ ని ఫ్యాన్స్ కి తెలిసేలా చేస్తోంది. కాగా ప్రస్తుతం సదా.. స్టార్ మా టీవీలో ప్రసారమవుతోన్న 'నీతోనే డాన్స్ షో' కి జడ్జ్ గా చేస్తుంది.

అయితే ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి తను ఒక మెసేజ్ ని ఇచ్చింది. 'ఫ్రీడమ్ ఫర్ ఆల్' అంటూ నోరు లేని మూగజీవాల గురించి, వాటిని పరిరక్షించమని చెప్పుకొచ్చింది సదా. పాలు, మాంసం, గుడ్లు అంటూ మన స్వార్థం కోసం నోరులేని జీవాలని హింసించొద్దని.‌. మనలాగే వాటికి ఫ్రీడమ్ ఇవ్వాలంటూ అందులో చెప్పింది సదా. స్వాతంత్ర్య దినోత్సం సందర్భంగా ఈ ప్లెడ్జ్ అందరూ తోసుకోవాలని సదా చెప్పింది. కాగా తన ఇన్ స్టాగ్రామ్ లో‌ సదా పోస్ట్ చేసిన ఈ వీడియో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది‌.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.