English | Telugu
బాపు కోసం హే రామ్ విడుదల చేసిన కమల్
Updated : Aug 16, 2023
కమల్ హాసన్ హే రామ్ సినిమా గుర్తుందా? అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ సినిమాకు మాస్టర్డ్ వెర్షన్ అవైలబుల్‌లో ఉంది యూట్యూబ్‌లో. అది కూడా ఉచితంగా అందుబాటులో ఉంది. 77వ ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకుని బాపు (మహాత్మా గాంధి)కి తన నివాళి అంటూ ఈ విషయాన్ని షేర్ చేశారు కమల్‌హాసన్. హిస్టారికల్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కించారు హే రామ్‌ని. ఈ సినిమాకు రాసి, డైరక్ట్ చేసి, నిర్మించిన, నటించిన ఘనత కమల్‌హాసన్‌ది. హే రామ్‌లో సాకేత్ రామ్‌గా నటించారు కమల్ హాసన్. మహాత్మా గాంధీని అసాసినేట్ చేస్తూ పోయే కేరక్టర్ అతనిది. చివరికి ఏమైంది? నాథూరామ్ గాడ్సే గురించి సినిమాలో ఏం చెప్పారు? వంటివన్నీ ఆసక్తికరమైన విషయాలు.
ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ కీ రోల్ చేశారు. హేమ మాలిని, రాణీ ముఖర్జీ, సౌరభ్ శుక్లా, అతుల్ కులకర్ణి, గిరీష్ కర్ణాడ్, వాలి, అబ్బాస్, నాజర్, వసుందరా దాస్, నసీరుద్దీన్ షా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఓం పురి కీ రోల్స్ చేశారు.ఇళయరాజా సంగీతం అందించారు. 47వ జాతీయ పురస్కారాల్లో మూడు విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది ఈ సినిమా.బాక్సాఫీస్ దగ్గర పెద్దగా కలెక్షన్లు తెప్పించలేకపోయింది. నెగటివ్ క్రిటిసిజమ్ వల్ల థియేటర్లలో అప్పట్లో రన్ లేదు. ఈ సినిమా తెరకెక్కించిన విధానం బావుందని అప్పట్లో ప్రశంసలు వచ్చాయి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీని పలువురు మెచ్చుకున్నారు.హే రామ్ సినిమాను మాస్టర్డ్ వెర్షన్ చేసి మళ్లీ విడుదల చేయకుండా యూట్యూబ్‌లో ఫ్రీగా ఎందుకు వదిలారా అన్నదే అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం.