English | Telugu

విజయ్ బెటర్ హాఫ్ లో ఉండాల్సిన క్వాలిటీ ఇదే అని చెప్పిన సామ్

విజయ్ దేవరకొండ, సమంత నటించిన "ఖుషి" మూవీ త్వరలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో యూట్యూబర్, ఆర్టిస్ట్ నిఖిల్ విజయేంద్ర సింహ ఈ ఇద్దరితో కలిసి చిన్న చిట్ చాట్ నడిపించాడు. అందులో ఒకరి గురించి ఒకరికి ప్రశ్నలు వేసాడు. అదేంటో చూద్దాం. "సమంతా నిక్ నేమ్" ఏంటి అని విజయ్ దేవరకొండని అడిగాడు నిఖిల్ వియాయేంద్ర సింహ. "సామ్" అని చెప్పాడు. "సమంతాస్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు" మేఘన" అని కరెక్ట్ గా చెప్పాడు. "సమంతకు ఇష్టమైన ఫుడ్ ఏమిటి" అనేసరికి "ఫుడ్ ఏదైనా ఎంజాయ్ చేస్తుంది" అని చెప్పాడు. "సమంతకి పిచ్చ కోపం వచ్చినప్పుడు ఫస్ట్ వాడే మాట ఏమిటి" " అంత బాడ్ లాంగ్వేజ్ ఉండదు సామ్ కి" అని చెప్పాడు కానీ సామ్ మాత్రం "నీ" అంటాను ముందు అని చెప్పింది.

"సమంత బర్త్ డే ఎప్పుడు" "ఏప్రిల్ 28 " అని చెప్పాడు. "సమంతకి కోపం వచ్చినా, ఆనందమొచ్చినా ఏం చేస్తుంది" "హ్యాపీనెస్ వస్తే అందరితో షేర్ చేసుకుంటుంది. బాధగా ఉంటే మాత్రం అసలు ఎవరికీ టచ్ లోకి రాదు. మెసేజ్ కి రిప్లై ఇవ్వకపోయినా, కాల్ చేయకపోయినా ఏదో జరిగింది అని అర్ధమవుతుంది. కానీ అసలు విషయం ఏమిటి అని ఆమె చెప్పాడు మనమే తెలుసుకోవాలి " అని సామ్ గురించి చెప్పేసాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు విజయ్ గురించి సామ్ ని అడిగాడు నిఖిల్. "విజయ్ కి రీసెంట్ గా వచ్చిన ఫిలిమ్స్ లో ఏదంటే ఇష్టం " "బేబీ" అని చెప్పింది. "ఏ యాప్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు" "గేమింగ్ యాప్" అని చెప్పింది. "సెట్ కి వచ్చినప్పుడు విజయ్ చేసే ఫస్ట్ పని ఏమిటి" "శివ మనమేం షూట్ చేయబోతున్నాం" అని అడుగుతారు. "విజయ్ తన బెటర్ హాఫ్ లో ఏ క్వాలిటీ ఉండాలని అనుకుంటారు" "నార్మల్ గా ఉంటూ తన ఫామిలీతో కలిసిపోయే క్వాలిటీని ఎక్కువ ఇష్టపడతాడు" అని చెప్పింది. "విజయ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు" అనేసరికి "ఒక్క బెస్ట్ ఫ్రెండ్ కాదు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు" అని చెప్పింది సామ్. "ప్రస్తుతం విజయ్ ఫేవరేట్ ఆర్టిస్ట్ ఎవరు" "అలియాభట్" "విజయ్ కి బాగా కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడతాడు" "అది ఒక బూతు నేను చెప్తే బాగోదేమో" అని చెప్పింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.