English | Telugu

దేవర వర్సెస్ భైర.. పోరు మాములుగా ఉండదు మరి!

'జనతా గ్యారేజ్' (2016)తో సంచలన విజయం అందుకున్న కాంబినేషన్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివది. కట్ చేస్తే.. ఏడేళ్ళ తరువాత ఈ ఇద్దరు మరోమారు జట్టుకట్టారు. 'దేవర' పేరుతో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ .. పాన్ ఇండియా మూవీగా జనం ముందుకు రానుంది. ఇందులో ఎన్టీఆర్ కి జంటగా అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ నటిస్తోంది. ప్రతినాయకుడుగా ప్రముఖ హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ దర్శనమివ్వనున్నారు.

ఇదిలా ఉంటే, బుధవారం (ఆగస్టు 16) సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ సైఫ్ పోషిస్తున్న భైర పాత్రకి సంబంధించి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది. ఇందులో సైఫ్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఈ లుక్ ని రివీల్ చేస్తూ.. బిగ్ స్క్రీన్ పై దేవర, భైర ఫేస్-ఆఫ్అదిరిపోయే స్థాయిలో ఉండబోతున్నట్లు చెప్పుకొచ్చింది యూనిట్. మరి.. 'దేవర వర్సెస్ భైర' పోరు ఎలా ఉండబోతుందో తెలియాలంటే 2024 ఏప్రిల్ 5 వరకు వేచి చూడాల్సిందే.

కాగా, 'దేవర'కి కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ బాణీలు అందిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.