English | Telugu
చిరంజీవి మోకాలికి శస్త్ర చికిత్స పూర్తి
Updated : Aug 16, 2023
మెగాస్టార్ చిరంజీవి మోకాలికి శస్త్ర చికిత్స జరగనుందంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఢిల్లీ లేదా బెంగుళూరులో ఆపరేషన్ జరగనుందని అన్నారు. దీంతో ముందు అభిమానులు ఈ విషయం కాస్త కంగారు పడ్డప్పటికీ, భయపడేంత ఆపరేషన్ కాదని, చిన్నదేనని ఆయన సన్నిహిత వర్గాలు నుంచి సమాచారం వచ్చిన తర్వాత అందరూ కూల్ అయ్యారు. తాజా సమాచారం మేరకు ఢిల్లీలో చిరంజీవి మోకాలికి ఆపరేషన్ పూర్తయ్యింది. మెడికల్ టర్మ్స్‌లో దీన్ని ఆర్థోస్కోపి నీ వాష్ అంటారు.
ఇంతకీ ఆర్థోస్కోపి నీ వాష్ అంటే ఏంటంటే.. మోకాలి భాగంలో ఉండే ఇన్‌ఫెక్షన్‌ను తొలగించి కొత్త ఫ్లూయిడ్స్‌ను ఎక్కిస్తారు. మోకాలి దగ్గర రెండు చిన్న రంధ్రాలు చేసి ఎలాంటి నొప్పి లేకుండా ఆపరేషన్ పూర్తి చేస్తారు. అలాంటి శస్త్ర చికిత్సనే చిరంజీవికి చేశారు. ఇప్పుడాయన వారం రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడ మరో నాలుగు నుంచి ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరం. తర్వాతే చిరంజీవి తన సినిమాలకు సంబంధించిన షూటింగ్స్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది.
రీసెంట్‌గా భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి తదుపరి చిత్రాన్ని కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి చిరంజీవి పెద్ద కుమార్తు సుష్మిత, ఆమె భర్త విష్ణు వర్ధన్ నిర్మించనున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటించనుంది. చిరంజీవి పుట్టినరోజు ఆగస్ట్ 22న ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ సర్కిల్స్ సమాచారం.