English | Telugu

స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఫిల్మ్స్ తో 60 ప్లస్ స్టార్స్ సందడి

ఆరు పదులు దాటినా.. "తగ్గేదేలే" అంటూ దూసుకుపోతున్నారు సీనియర్ స్టార్స్. ఆ మధ్య తమ స్థాయి విజయాలు లేకపోవడంతో.. "ఇక వీరి పని అయిపోయిందిలే" అనుకున్న వారందరికి సెన్సేషనల్ సక్సెస్ తో సమాధానమిస్తున్నారు 60 ప్లస్ స్టార్స్. తెలుగు, తమిళం, హిందీ.. ఇలా ప్రతీ చోట సీనియర్ స్టార్స్ సాలిడ్ హిట్స్ తో కమ్ బ్యాక్ ఇస్తున్నారు. వారి వివరాల్లోకి వెళితే..

చిరంజీవి:'ఖైదీ నంబర్ 150'తో రిఎంట్రీ ఇచ్చి "బాస్ ఈజ్ బ్యాక్" అనిపించిన చిరంజీవి.. ఆ తరువాత 'సైరా నరసింహారెడ్డి', 'ఆచార్య', 'గాడ్ ఫాదర్'తో నిరాశపరిచారు. అయితే, ఈ సంక్రాంతికి వచ్చిన 'వాల్తేరు వీరయ్య'తో సెన్సేషనల్ హిట్ అందుకుని కమ్ బ్యాక్ ఇచ్చారు.

బాలకృష్ణ:'గౌతమీపుత్ర శాతకర్ణి' తరువాత కాస్త ట్రాక్ తప్పినట్లు కనిపించిన బాలకృష్ణ.. 'అఖండ'తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఆపై 'వీరసింహారెడ్డి'తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం చేస్తున్న 'భగవంత్ కేసరి'తో హ్యాట్రిక్ పై కన్నేశారు.

రజినీకాంత్:'రోబో' తరువాత ఆ స్థాయి విజయం అందుకోని రజినీకాంత్.. ప్రస్తుతం 'జైలర్'తో రికార్డుల ఊచకోత బాట పట్టారు. తాజాగా ఈ యాక్షన్ థ్రిల్లర్.. రూ. 400 కోట్ల గ్రాస్ క్లబ్ లోనూ చేరి వార్తల్లో నిలిచింది.

కమల్ హాసన్:'దశావతారం' వంటి సంచలన సినిమా తరువాత కమల్ హాసన్ నుంచి ఆ స్థాయి మూవీ రావడానికి చాలానే టైమ్ పట్టింది. మధ్యలో ఒకట్రెండు విజయాలు ఉన్నా.. తన రేంజ్ కి తగ్గవి కాదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో.. గతేడాది 'విక్రమ్'తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు కమల్.

సన్నీ డియోల్: బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ బ్లాక్ బస్టర్ చూసి.. రెండు దశాబ్దాలైంది. హిందీ చిత్ర పరిశ్రమలోనే బిగ్గెస్ట్ హిట్ అయిన 'గదర్' (2001) తరువాత 'ఇండియన్' (2001), 'యామ్లా పాగ్లా దీవానా' (2011) వంటి చెప్పుకోదగ్గ విజయాలు మాత్రమే చూశారు సన్నీ. కట్ చేస్తే.. పంద్రాగస్టు ప్రత్యేకంగా విడుదలైన 'గదర్ 2'తో ప్రస్తుతం వసూళ్ళ వర్షం కురిపిస్తున్నారు. ఐదు రోజుల్లో రూ. 228.98 కోట్ల నెట్ తో ఈ సినిమా వార్తల్లో నిలిచింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.