English | Telugu
ట్రాప్‌లో పడొద్దు.. వరుణ్ తేజ్‌కి రామ్ చరణ్ సలహా
Updated : Aug 16, 2023
మెగా హీరోల్లో ఇప్పుడు రామ్ చరణ్ పాన్ ఇండియా హీరో ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. భారీ బడ్జెట్ సినిమాలనే చేస్తూ వస్తున్నారు. సినిమాలనే కాదు.. ఫ్యామిలీ విషయాల్లో చరణ్ తన వారికి మంచి సలహాలనే ఇస్తున్నారు. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. హీరో వరుణ్ తేజ్. తనకు అన్నయ్య రామ్ చరణ్ కెరీర్ పరంగా ఓ సలహాను ఇచ్చారని, ఇప్పుడు ఆ సలహానే తాను పాటిస్తున్నానని అంటున్నారు వరుణ్ తేజ్. ఇంతకీ తమ్ముడుకి మెగా పవర్ స్టార్ ఇచ్చిన సలహా ఏంటనే వివరాల్లోకి వెళితే..
రామ్ చరణ్‌తో ఉన్న అనుబంధం గురించి వరుణ్ తేజ్ ఓ సందర్భంలో మాట్లాడుతూ ‘‘నా ఏడవ సినిమా తర్వాత రామ్ చరణ్ అన్నయ్యను కలిశాను. అప్పుడాయన యూనిక్ స్క్రిప్ట్స్‌ను సెలక్ట్ చేసుకో అన్నారు. నీ చుట్టూ ఉండేవాళ్లు మార్కెట్ పోతుందని చాలా సలహాలు ఇస్తారు. దాని వల్ల ప్రయోగాలు చేయటానికి ఆలోచనలో పడతావు. కాబట్టి అలాంటి ట్రాప్‌లో పడొద్దు’’ అన్నారు.
వరుణ్ తేజ్ ఇప్పుడు యాక్షన్ ఎంటర్‌టైనర్ గాండీవధారి అర్జున చిత్రంతో సందడి చేయబోతున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 25న రిలీజ్ కానుంది. ఇందులో గ్లోబల్ వార్మింగ్‌కు సంబంధించిన మెసేజ్‌ను కూడా ఇస్తున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమాను బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ఏడాదిలోనే హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నారు.