రామ్ చరణ్ కోసం శంకర్ సూపర్బ్ స్కెచ్!
RRR వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్ చేంజర్’. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో దిల్ రాజు, శిరీష్ మూవీని నిర్మిస్తున్నారు. శంకర్ మేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతీ సన్నివేశాన్ని ఓ వండర్‌లా తెరకెక్కించాలని ఆయన తాపత్రయ పడుతుంటారు మరి. ‘గేమ్ చేంజర్’ మూవీ ప్రారంభమై రెండేళ్లు కావస్తుంది. ఇంకా పూర్తి కాలేదు. మరో వైపు ఫ్యాన్స్, ప్రేక్షకులు సినిమా అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అదేంటంటే ‘గేమ్ చేంజర్’లో రామ్ చరణ్‌ను శంకర్ ఒకటి, రెండు కాదు.. ఏకంగా ఏడు లుక్స్‌లో చూపించబోతున్నారట.