English | Telugu
రజినీకాంత్ సినిమాలో శర్వానంద్..!
Updated : Aug 16, 2023
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ రాబోయే సినిమాలపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. అందుకు కారణం రీసెంట్‌గా రిలీజైన ‘జైలర్’ సినిమానే. ఆ మూవీ విడుదలైన ఆరు రోజులకే రూ. 400 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇప్పటి వరకు సినిమా ఏకంగా రూ.70 కోట్ల లాభాలతో రన్ అవుతోంది. ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్స్ వస్తుండటం చూస్తే సినిమా రూ.500 కోట్లను సులవుగానే దాటేస్తుందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. దీంతో రజినీకాంత్ అప్‌కమింగ్ మూవీస్‌పై అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం తలైవర్ రెండు సినిమాలు రాబోతున్నాయి. అందులో ఒకటి లాల్ సలాం. ఇందులో రజినీ కీలక పాత్రలో మాత్రమే కనిపించనున్నారు. ఇక మరో సినిమా విషయానికి వస్తే..దాన్ని ‘జై భీమ్’ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఇది త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
ఈ రెండు సినిమాల్లో అందరి దృష్టి ‘జై భీమ్’ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ చేస్తోన్న సినిమాపైనే ఉంది. అందుకు కారణం.. ఇందులో రజినీకాంత్‌తో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా నటించబోతున్నారు. కాగా.. ఇప్పుడు ఓ టాలీవుడ్ స్టార్ కూడా ఇందులో యాడ్ కాబోతున్నారు. ఆ స్టార్ ఎవరో కాదు శర్వానంద్ అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది పాన్ ఇండియా మూవీగా రానుంది. అంటే శర్వానంద్ తొలి పాన్ ఇండియా మూవీ ఇదే అవుతుంది.
ఈ చిత్రంలో రజినీకాంత్ పేక్ ఎన్‌కౌంటర్స్ మీద పోరాటం చేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ‘జై భీమ్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన జ్ఞానవేల్ ఈ సినిమాలో ఎలాంటి పాయింట్‌ను ఎలివేట్ చేయబోతున్నారనేది అందరిలోనూ ఆసక్తిని మరింత రేకెత్తిస్తోంది.