English | Telugu

సామ్ కోసం చిన్మయి సాంగ్...ఐ లవ్ యు అంటూ హగ్

సమంత అంటే చాలామందికి ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్. ఆమె బోల్డ్ నెస్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఎలాంటి కఠినమైన పరిస్థితి ఉన్నా తట్టుకుని పైకి వచ్చే సత్తా సమంతలో ఉంది. అలాంటి సమంత విజయ్ దేవరకొండతో కలిసి "ఖుషి" మూవీలో నటించింది. త్వరలో అది రిలీజ్ కాబోతోంది. ఆ మూవీ ప్రొమోషన్స్ మంచి జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్స్ లో చిన్మయి సమంత గురించి చాలా పొగిడేసింది. "సామ్ నీకు ఈ విషయం గురించి చెప్పాలనుకుంటున్నా...తెలుగులో నా డబ్బింగ్ కెరీర్ స్టార్ట్ అయ్యింది మీ వల్లే. నువ్వు ఎంతోమంది అబ్బాయిలకు, అమ్మాయిలకు ఇన్స్పిరేషన్ , నువ్వు ఎంతోమందికి హీరోవి. సమంత చాలా నైస్ పర్సన్, ది బెస్ట్, ది బ్రేవెస్ట్ పర్సన్, ది బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ ని ఈ ప్రపంచంలో నేను ఇంతవరకు చూడలేదు.

ఎవరేమనుకున్నా నా ఒపీనియన్ ఇది . సమంతని ఇష్టపడే వాళ్లంతా కూడా ఎస్ అనే అంటారు అని చెప్పింది చిన్మయి. అలాగే సమంత కోసం ఒక సాంగ్ ని డేడికేట్ చేసింది "ఏ దేవి వరము నీవో...చిరునీడలేల కనుల " అనే సాంగ్ పాడి "సమంత వి లవ్ యు" అని ఎండ్ చేసింది. సమంత, చిన్మయి ఈ ఇద్దరి రూటే సెపరేటు...ఈ ఇద్దరూ ఏ విషయంలో ఐనా ముక్కుసూటిగా ఉంటారు. సోషల్ మీడియాలో కూడా వీళ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. చిన్మయి కాస్టింగ్ కౌచ్ గురించి బోల్డ్ కామెంట్స్ కూడా చేసింది. ఇక సమంత ఇప్పుడు మూవీస్ కి బ్రేక్ ఇచ్చేసి ట్రీట్మెంట్ తీసుకోవాడికి ఫారెన్ వెళ్ళింది. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఎంతో ట్రై చేస్తోంది. అలా ప్రకృతిలో విహరిస్తూ ఆనందంగా ఉంటోంది సమంత.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.