English | Telugu
'భోళా శంకర్' 5 రోజుల కలెక్షన్స్.. ఎన్ని కోట్ల రూపాయిల నష్టమో తెలుసా
Updated : Aug 16, 2023
మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' ఆగస్టు 11న జనం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రీమేక్ మూవీకి.. మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది. దానికి తోడు ఫస్ట్ డే నుంచి కలెక్షన్స్ కూడా మెగాస్టార్ రేంజ్ కి తగ్గట్టుగా లేవు. వారాంతంలో ఓ మోస్తరు వసూళ్ళు చూసినప్పటికీ.. మండే టెస్ట్ లో మాత్రం ఘోరంగా ఫెయిలైంది 'భోళా శంకర్'. ఇక పంద్రాగస్టు సెలవుదినాన్ని సైతం 'భోళా శంకర్' వినియోగించుకోలేకపోయింది. ఐదవ రోజైన ఆగస్టు 15న కేవలం రూ. 1. 12 కోట్ల షేర్ మాత్రమే ఆర్జించింది.
రూ. 80.50 కోట్ల షేర్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన 'భోళా శంకర్'.. మొదటి 5 రోజుల్లో కేవలం రూ. 26.88 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. నాలుగో రోజునే రూ. లక్షలకి పడిపోయిన షేర్.. ఐదో రోజున కాస్త పుంజుకున్నా బుధవారం నుంచి మళ్ళీ రూ. లక్షలకి పడిపోయే అవకాశముందంటున్నారు ట్రేడ్ పండితులు. అంతేకాదు.. మొదటి వారానికే థియేట్రికల్ రన్ ముగిసే అవకాశముందని చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా 'భోళా శంకర్'కి రూ. 50 కోట్ల నష్టమైతే తప్పదంటున్నారు.
భోళా శంకర్ 5 రోజుల కలెక్షన్స్ వివరాలు:
నైజాం: రూ. 6.91 కోట్ల షేర్
సీడెడ్: రూ. 3.24 కోట్ల షేర్
ఉత్తరాంధ్ర: రూ. 3.18 కోట్ల షేర్
ఈస్ట్ గోదావరి : రూ. 1.90 కోట్ల షేర్
వెస్ట్ గోదావరి : 2.19 కోట్ల షేర్
గుంటూరు: రూ. 2.67 కోట్ల షేర్
కృష్ణ: రూ. 1.61 కోట్ల షేర్
నెల్లూరు: రూ. 1.18 కోట్ల షేర్
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్స్: రూ. 22.88 కోట్ల షేర్ (రూ. 33.30 కోట్ల గ్రాస్)
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా: రూ. 1.80 కోట్ల షేర్
ఓవర్సీస్: రూ. 2.20 కోట్ల షేర్
ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్స్: రూ. 26.88 కోట్ల షేర్ (రూ. 42.80 కోట్ల గ్రాస్)