English | Telugu
'కింగ్ ఆఫ్ కొత్త' సెకండాఫ్ రివ్యూ: పేరులో కొత్త ఉంది కానీ..
Updated : Aug 24, 2023
దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ మూవీ 'కింగ్ ఆఫ్ కొత్త'.. గురువారం (ఆగస్టు 24) ప్రేక్షకుల ముందుకొచ్చింది. మలయాళంతో పాటు తెలుగులోనూ రిలీజైన ఈ సినిమాతో అభిలాష్ జోషి దర్శకుడిగా పరిచయమయ్యాడు.
ఇదిలా ఉంటే, ఫస్టాఫ్ ముగిసే సమయానికి యావరేజ్ అనే టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. కొద్దినిమిషాల క్రితం సెకండాఫ్ ప్రదర్శన కూడా పూర్తిచేసుకుంది. ఫస్టాఫ్ తో పోలిస్తే.. సెకండాఫ్ లో క్యారెక్టర్ ల రేంజ్ తగ్గిందని, దాంతో సినిమా గ్రాఫ్ పడిపోయిందని చెప్పుకుంటున్నారు. అయితే, దుల్కర్ సల్మాన్, షబీర్ (డాన్సింగ్ రోజ్) మధ్య సాగే సన్నివేశాలు ప్లస్సయ్యాయని అంటున్నారు. జేక్స్ బిజోయ్ బ్యా గ్రౌండ్ స్కోర్ సెకండాఫ్ ని కూడా నిలబెట్టిందని అంటున్నారు. ఓవరాల్ గా.. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ కాస్త బెటర్ గానే ఉందన్నది రిపోర్ట్. దర్శకుడిగా అభిలాష్ జోషి అనుభవ లేమి.. ఈ రొటీన్ గ్యాంగ్ స్టర్ డ్రామాని మరింత రొటీన్ చేసిందని అంటున్నారు.