English | Telugu
బోయపాటి కోసం బాలయ్య ఆ మాత్రం చెయ్యడా?
Updated : Aug 24, 2023
రామ్ పోతినేని హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘స్కంద’. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్స్‌లో, గ్లింప్స్‌లో పూర్తి మాస్ లుక్‌లో కనిపిస్తున్న రామ్ అదుర్స్ అంటున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలోని పాటలకు డాన్సులు కూడా అదే లెవల్‌లో ఉన్నాయంటున్నారు. ఈ సినిమా రిలీజ్‌ను చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. అలాగే ప్రమోషన్స్‌ను కూడా డిఫరెంట్‌గా ఉండేలా చూసుకుంటున్నారు. గతంలో బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడు రామ్‌తో బోయపాటి చేస్తున్న ‘స్కంద’ కూడా అదే రేంజ్‌లో ఉంటుందంటున్నారు. అందులో భాగంగానే ‘స్కంద’ ట్రైలర్‌ను నటసింహ నందమూరి బాలకృష్ణతో రిలీజ్ చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ ‘స్కంద’ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు.