English | Telugu

పవిత్రా లోకేష్ పై నరేష్ తనయుడు కీలక వ్యాఖ్యలు

టాలీవుడ్ సీనియర్ నటుడు వి.కె.నరేష్ ఈ మధ్య కాలంలో వార్తల్లో వ్యక్తిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆయన తెలుగు, తమిళంతో పాటు కన్నడలో పలు చిత్రాల్లో నటించిన నటి పవిత్రా లోకేష్ తో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటున్నారు. తన మూడో భార్య రమ్యా రఘుపతితో తనకు పొసగటం లేదని, ఆమె తనతో కలిసి ఉండటం లేదని విడాకులకు కూడా అప్లయ్ చేసుకున్నారు. ఈ కేసు కోర్టులో ఉంది. అదే సమయంలో రమ్యా రఘుపతి మీడియాకెక్కి రచ్చ చేసింది. దానికి ప్రతిగా నరేష్, పవిత్రా లోకేష్ సైతం కౌంటర్ ఇచ్చారు. ఇలా కొన్నాళ్లు ఇరువురు మీడియాలో వార్తగా నిలిచారు. ఇప్పుడు పరిస్థితులు సైలెంట్ గానే ఉంటున్నాయి.

నరేష్, పవిత్రా లోకేష్ రిలేషన్ పై ఆయన కుటుంబ సభ్యులు మరీ ముఖ్యంగా ఆయన తనయుడు నవీన్ విజయ్ కృష్ణ ఏమనుకుంటున్నారనే దానిపై ఇన్నాళ్లు బయటకు తెలియలేదు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంపై నవీన్ రీసెంట్ గా ఓపెన్ అయ్యారు. తన తండ్రికి నవీన్ మద్దతుని తెలియజేయటం విశేషం. ''మా కుటుంబంలో నిర్ణయాలను తీసుకునే హక్కు ఉంది. ఎవరు మనసుకు నచ్చింది వారు చేస్తుంటారు. దీని వల్ల అప్పుడుప్పుడు కొన్ని తప్పులు జరిగాయి. దాని గురించి నేనేం చెడుగా భావించలేదు. నాన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, నేను గౌరవిస్తాను. ఆయన సంతోషంగా ఉండటమే కావాలి. ఇతరుల కోసం మనం జీవితాన్ని వెళ్లదీయలేం కదా.

నాన్న గురించి చెప్పాలంటే ఎవరేమనుకున్నా తన పనిని తాను చేసుకుంటూ పోతారు. పవిత్రా లోకేష్ చాలా మంచి వ్యక్తి. ఎప్పటి నుంచో నాకు తెలుసు. నేను ఏ ప్రాజెక్ట్ చేస్తున్నా సరే.. ఆల్ ది బెస్ట్ చెప్పి అభినందనలు తెలియజేస్తున్నారు. ఆమెను పవిత్రగారు అని పిలుస్తుంటాను. అప్పుడప్పుడు తనతో మాట్లాడుతుంటాను'' అని పేర్కొన్నారు నవీన్ విజయ్ కృష్ణ.