English | Telugu
ఎన్టీఆర్, మోక్షజ్ఞ హగ్ చేసుకున్న వేళ...
Updated : Aug 24, 2023
నందమూరి ఫ్యామిలీతో జూ॥ ఎన్టీఆర్‌కి సంత్సంబంధాలు లేవని, మొదటి నుంచీ ఎన్టీఆర్‌ని ఆ ఫ్యామిలీ పక్కన పెడుతూ వచ్చిందనే విషయం అందరికీ తెలిసిందే. చాలా సందర్భాల్లో ఆ ఫ్యామిలీలోని కొందరి వల్ల ఎన్టీఆర్ అవమానాల్ని ఎదుర్కొన్నాడు. అయితే ఈ విషయంలో బాలకృష్ణ చొరవ తీసుకొని ఎన్టీఆర్‌ని చేరదీస్తే బాగుండేదని ఎన్టీఆర్ అభిమానులతోపాటు నందమూరి ఫ్యాన్స్ కూడా ఆశించారు. కానీ, అవేవీ ఇప్పటివరకు జరగలేదు. అయితే ఇటీవల నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని కుమారుడి పెళ్ళిలో ఎన్టీఆర్‌కు బాలకృష్ణ షేక్‌హ్యాండ్ ఇవ్వడంతో అందరూ షాకైపోయారు. ఇక అభిమానుల గురించి చెప్పనవసరం లేదు.
అదే పెళ్ళిలో మూడోతరం వారసులు నందమూరి కళ్యాణ్‌రామ్, ఎన్టీఆర్, మోక్షజ్ఞ కలిసి ఫోటో దిగడంతో అభిమానులు సంబరపడిపోయారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు సైతం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో రియాక్టవుతూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఎన్టీఆర్, మోక్షజ్ఞ హగ్ చేసుకున్న ఫోటో బయటికి వచ్చింది. దాంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో అన్న, తమ్ముడు అంటూ వైరల్ చేసేస్తున్నారు.