English | Telugu

'కింగ్ ఆఫ్ కొత్త'.. ఏ ఓటీటీలో స్ట్రీమ్ కానుందంటే..!

మాలీవుడ్ సెన్సేషన్ దుల్కర్ సల్మాన్ నటించిన తాజా చిత్రం 'కింగ్ ఆఫ్ కొత్త'. అభిలాష్ జోషి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో ఐశ్వర్య లక్ష్మి, ప్రసన్న, షబీర్ కల్లారక్కల్, అనిఖా సురేంద్రన్, నైలా ఉష, శరణ్ శక్తి, షమ్మి తిలకన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా.. ధ్రువ్ విక్రమ్ అతిథి పాత్రలోనూ, రితికా సింగ్ స్పెషల్ సాంగ్ లోనూ దర్శనమిచ్చారు. నేడు (ఆగస్టు 24) ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు వెర్షన్ లోనూథియేటర్స్ లోకి వచ్చింది.

ఇదిలా ఉంటే, ప్రముఖ ఓటీటీ సంస్థ 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్' ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ని సొంతం చేసుకుంది. ఈ విషయం.. 'కింగ్ ఆఫ్ కొత్త' టైటిల్స్ లో ఓటీటీ పార్టనర్ నిపేర్కొనడంతో స్పష్టమైంది. బహుశా వచ్చే నెలలో లేదా అక్టోబర్ లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'కింగ్ ఆఫ్ కొత్త' స్ట్రీమ్ అయ్యే అవకాశముందంటున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.