English | Telugu
పవర్‌స్టార్ హీరోయిన్ మళ్ళీ ఈ వయసులో హీరోయిన్‌గా వస్తోందా?
Updated : Sep 2, 2023
సాధారణంగా చాలా మంది హీరోయిన్లు కొంతకాలం వరకు అంటే ఓ పదేళ్ళు హీరోయిన్‌గా కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా హీరోయిన్‌గా చెయ్యాలంటే కొంచెం కష్టం. అప్పటికే కొత్త హీరోయిన్లు వచెయ్యడంతో చాలా సందర్భాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయిపోతుంటారు. కానీ, ఇప్పుడు ఓ హీరోయిన్ 40 ఏళ్ళు దాటిన తర్వాత కూడా హీరోయిన్‌గా నటిస్తానంటూ ముందుకు వస్తోంది. ‘అమ్మాయి బాగుంది’ చిత్రంతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్ ఆ తర్వాత రవితేజతో ‘భద్ర’, పవన్‌కళ్యాణ్‌తో ‘గుడుంబా శంకర్’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి ఆ తర్వాత కూడా హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో చేసింది. చాలా గ్యాప్ తర్వాత ఇటీవల విడుదలైన ‘విమానం’ సినిమాలో కనిపించింది. 41 ఏళ్ళ మీరా ఇప్పుడు కూడా హీరోయిన్ చేస్తానని కాన్ఫిడెంట్‌గా చెబుతోంది. శ్రీవిష్ణు, రీతువర్మ జంటగా నటిస్తున్న ‘స్వాగ్’ చిత్రంలో మీరా జాస్మిన్ మరో హీరోయిన్‌గా నటిస్తోందట. మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో హీరోయిన్‌గా మీరా ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.