English | Telugu
ఇప్పటివరకు నేను చూసిన పికె ట్రైలర్స్‌లో ‘ఒజి’ ది బెస్ట్ - ఆర్‌జివి
Updated : Sep 2, 2023
తన ట్విట్టర్ పోస్టుల ద్వారా వార్తల్లో నిలిచే డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ. ఏదైనా ఘటనకు స్పందించాలనుకుంటే ట్విట్టర్‌ను వేదికగా చేసుకునే వర్మ.. పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మరోసారి వార్తల్లోకి వచ్చాడు. పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అతని కొత్త సినిమా ‘ఒజి’ గ్లింప్స్ రిలీజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. పవన్‌కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి, ‘ఒజి’ గ్లింప్స్‌పై రామ్‌గోపాల్‌వర్మ స్పందిస్తూ ‘ఒజి గ్లింప్స్ ప్రపంచాన్ని దాటేసిందది. నేను ఇప్పటివరకు చూసిన పికె ట్రైలర్స్‌లో ఇది అత్యుత్తమం. హే సుజిత్ మీరు చంపేశారు బ్రో’ అంటూ ట్వీట్ చేశారు. పవన్‌కల్యాణ్ విషయంలో ఎక్కువగా నెగెటివ్‌గానే స్పందించే వర్మ ఈసారి ఎంతో పాజిటివ్ అప్రిషియేట్ చెయ్యడంతో నెటిజన్లు, ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇది ఎవ్వరూ ఊహించని ట్వీట్ అంటున్నారు.