English | Telugu
గణేష్ ఉత్సవాలు ‘భగవంత్ కేసరి’తో ముందే షురూ!
Updated : Sep 2, 2023
నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘భగవంత్ కేసరి’ మంచి ఊపు మీద ఉన్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీలకు బాబాయ్‌గా నటిస్తున్నారు బాలకృష్ణ. కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఈ సినిమాలో మొదటిసారి బాలకృష్ణ తెలంగాణ యాసలో డైలాగులు చెప్పబోతున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తెలుగువారు ఎంతో ఉత్సాహంతో జరుపుకునే వినాయక చవితి పర్వదినం త్వరలో రానుండడంతో ఈ సినిమాలోని గణేష్ ఆంథమ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈసారి వినాయక చవితికి ఈ ఆంథమ్ అన్నిచోట్లా అదిరి పోవడం ఖాయమని అభిమానులు ఉత్సాహంగా చెబుతున్నారు. ‘బిడ్డా ఆన్తలేదు.. సప్పుడు జర గట్టిగా చేయమను’ అని బాలయ్య అడగడంతో.. ‘తీసి పక్కన పెట్టండ్రా మీ తీన్‌మారు.. కొట్టరకొట్టు సౌమారు’ అని బిడ్డ హైప్ పెంచేసింది. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను కరీముల్లా, మనీష పాండ్రంకి ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ పాటలో శ్రీలీల, బాలకృష్ణ తమ ఎన్జరీతో మంచి ఊపు తీసుకొచ్చారు. బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ ఈ చిత్రంలో విలన్‌గా నటించడం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అక్టోబర్ 19న ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కాబోతోంది.