English | Telugu

రెండో రోజు 'ఖుషి' జోరు.. తగ్గేదేలే అంటున్న వసూళ్ళు!

విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఖుషి'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ ఫిల్మ్ సెప్టెంబర్ 1న విడుదలైంది. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా విజయ్ కెరీర్ లోనే హైయెస్ట్ రాబట్టిన ఈ మూవీ.. రెండో రోజు కూడా అదే జోరు చూపించింది.

తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.9.87 కోట్ల షేర్, రెండో రోజు రూ.5.36 కోట్ల షేర్ రాబట్టిన ఖుషి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రెండు రోజుల్లో రూ.15.23 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఏరియాల వారీగా చూస్తే రెండు రోజుల్లో నైజాంలో రూ.8.45 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.1.34 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.5.44 కోట్ల షేర్ రాబట్టింది. ఇక రెస్టాఫ్ ఇండియా రూ.2.65 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.5.95 కోట్ల షేర్ కలిపి రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.23.83 కోట్ల షేర్ వసూలు చేసింది.

వరల్డ్ వైడ్ గా రూ.53 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఖుషి మూవీ.. మొదటి రోజు రూ.15.37 కోట్ల షేర్, రెండో రోజు రూ.8.46 కోట్ల షేర్ తో రెండు రోజుల్లో.. రూ.23.83 కోట్ల షేర్ రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో రూ.30 కోట్ల దాకా షేర్ రాబట్టాల్సి ఉంది. మూడో రోజైన ఈరోజు ఆదివారం కావడంతో ప్రపంచవ్యాప్తంగా పది కోట్ల షేర్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇదే జోరు కొనసాగితే వారం రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశముంది.

'ఖుషి' 2 రోజుల కలెక్షన్స్ వివరాలు:
నైజాం: రూ.8.45 కోట్ల షేర్
సీడెడ్ : రూ.1.34 కోట్ల షేర్
ఆంధ్రా: రూ.5.44 కోట్ల షేర్

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్స్ : రూ.15.23 కోట్ల షేర్
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా: రూ.2.65 కోట్ల షేర్
ఓవర్సీస్: రూ.5.95 కోట్ల షేర్

ప్రపంచవ్యాప్తంగా 2 రోజుల కలెక్షన్స్ : రూ.23.83 కోట్ల షేర్