English | Telugu
విశ్వక్ సేన్‌కి బాలయ్య సర్‌ప్రైజ్!
Updated : Sep 3, 2023
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్..నందమూరి ఫ్యామిలీ హీరోలకు పెద్ద అభిమాని. మరీ ముఖ్యంగా బాలకృష్ణ, ఎన్టీఆర్‌లంటే విశ్వక్ సేన్ తన అభిమానాన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు. అలాగే నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్‌లు సైతం విశ్వక్ సేన్ సినిమాలకు తమ సపోర్ట్‌ను అందిస్తుంటారు. తాజాగా మరోసారి వీరి మధ్య అనుబంధం బయటపడింది. విశ్వక్ సేన్‌కి నందమూరి బాలకృష్ణ అనుకోని సర్‌ప్రైజ్‌ను ఇచ్చారు. ఇంతకీ ఆయనేం చేశారనే వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఈ యంగ్ హీరో కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా సెట్స్‌ను బాలయ్య సందర్శించారు.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సెట్స్‌కు బాలయ్య వచ్చిన విషయాన్ని విశ్వక్ సేన్ తన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా తెలియజేశారు. ‘బాలకృష్ణగారు అద్భుతమైన సర్‌ప్రైజ్‌ను ఇచ్చారు. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. మీ రాకతో మా టీమ్‌కు ఎంతో సంతోషంగా ఉంది. లుక్ విడుదల కాకూడదనే ఉద్దేశంతో ఫుల్ ఫొటోను ఎవరికీ పంచుకోలేకపోతున్నాను. మూవీ రిలీజైన తర్వాత దీనికి సంబంధించిన ఫొటో, వీడియోను అందరికీ అందిస్తాను. ఇప్పటి వరకు ఫ్రేమ్‌లో ఉన్న బాలయ్య బాబు చాలు. ఫైర్ అంతే’ అని ఫొటోతో పాటు మెసేజ్‌ను కూడా పోస్ట్ చేశారు విశ్వక్.
కృష్ణ చైతన్య దర్శకత్వంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా తెరకెక్కుతోంది. విశ్వక్ సేన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో వైపు బాలకృష్ణ సైతం భగవంత్ కేసరి సినిమాలో నటించారు. ఆ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 19న రిలీజ్ అవుతుంది.