English | Telugu

‘ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే..’ - జూ. ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌

సెప్టెంబర్‌ 2 నందమూరి హరికృష్ణ జయంతి. ఈ సందర్భంగా ఆయన తనయుడు జూ. ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ ట్విట్టర్‌లో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ను పెట్టారు. ‘ఈ అస్తిత్వం మీరు. ఈ వ్యక్తిత్వం మీరు. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు. ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే’ అంటూ భావోద్వేంగా పోస్ట్‌ చేశారు జూ. ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌. 2018 ఆగస్ట్‌ 29న రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మరణించిన విషయం తెలిసిందే. ఓ అభిమాని వివాహానికి హాజరయ్యేందుకు కారులో వెళ్తూ నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద ప్రమాదానికి గురయ్యారు.