English | Telugu

దళపతికి నో చెప్పిన జో.. ఇప్పుడు మరో మాజీ స్టార్ హీరోయిన్ తో

కోలీవుడ్ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ లియో సినిమాను పూర్తి చేసుకున్నారు. ఆ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 19న తెలుగు, తమిళ భాషల్లో భారీ విడుదలకు సన్నద్ధమవుతోంది. అయితే విజయ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన 68వ సినిమాను స్టార్ట్ చేసేశారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో దళపతి విజయ్ 68వ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినీ సర్కిల్స్ లో వినిపిస్తోన్న సమాచారం మేరకు ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆయన సరసన ఇద్దరు హీరోయిన్స్ కనిపించబోతున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే మరో హీరోయిన్ గా ఎవరినీ తీసుకుంటారనే దానిపై ఇంకా చర్చ కొనసాగుతోంది. విజయ్ తో జ్యోతిక జోడీ కడుతుందంటూ న్యూస్ రాగానే అది హాట్ టాపిక్ గా మారింది.

ఎందుకంటే కోలీవుడ్ కి సంబంధించినంత వరకు ఈ 'ఖుషి' జంట చాలా మందికి ఇప్పటికీ హాట్ ఫెవరేట్ అనే చెప్పాలి. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కనిపిస్తే కన్నుల పండుగలా ఉంటుందని అందరూ భావించారు. అయితే జ్యోతిక మాత్రం దళపతి 68లో నటించటానికి నో చెప్పేశారట. దీంతో మేకర్స్ మరో మాజీ స్టార్ హీరోయిన్ అయిన సిమ్రాన్ తో చర్చలు జరుపుతున్నారట. విజయ్, సిమ్రాన్ జోడీ కూడా బ్లాక్ బస్టర్ కాంబోనే. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరోసారి ఆ హిట్ పెయిర్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లటానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయ్, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తొలిసారి రానున్న సినిమా ఇది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.