English | Telugu

'జవాన్' పబ్లిక్ టాక్.. అనిరుధ్ ఎంత పనిచేశావ్!

తమిళ్ బ్యాచ్ తో హిందీ స్టార్ షారుక్ ఖాన్ చేసిన సినిమా 'జవాన్'. ఇందులో బాలీవుడ్ బాద్షా షారుక్.. ద్విపాత్రాభినయం చేశారు. అతనికి జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించగా.. ప్రత్యేక పాత్రలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కనిపించింది. తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాని కోలీవుడ్ కి చెందిన దర్శకుడు అట్లీ రూపొందించారు. అలాగే, తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ స్వరాలు సమకూర్చాడు. భారీ అంచనాల నడుమ గురువారం (సెప్టెంబర్ 7) ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది.

సినిమా చూసిన జనాలు.. ఫస్టాప్ అదిరింది అంటున్నారు. అయితే, సెకండాఫ్ ఆ స్థాయిలో లేదంటున్నారు. నాలుగు యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయంటున్నారు. షారుక్, విజయ్ సేతుపతి ఫస్ట్ టైమ్ కలుసుకునే సన్నివేశంతో పాటు ట్రక్ ఛేజింగ్ సీన్స్, ఇంట్రవెల్ బ్యాంగ్, క్లైమాక్స్ (జైల్ ఎపిసోడ్) సూపర్బ్ అని చెప్పుకుంటున్నారు. ఎటొచ్చి.. ఫుల్ స్వింగ్ లో ఉన్న అనిరుధ్ మాత్రం పాటల పరంగా మస్త్ డిజప్పాయింట్ చేశాడంటున్నారు. అదే.. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయానికి వచ్చేసరికి చెలరేగిపోయాడంటున్నారు. ఏదేమైనా.. 'జవాన్' హిట్ బొమ్మే అని.. ఎమోషన్స్, యాక్షన్ తో సినిమాని బాగా కవర్ చేశారని అంటున్నారు. 'పఠాన్' తరువాత షారుక్ ఖాతాలో మరో బిగ్గెస్ట్ హిట్ క్రెడిట్ అయ్యే స్కోప్ ఉందని పబ్లిక్ టాక్.