English | Telugu
టైటిల్ లోనే ఖుషి ఉంది.. కలెక్షన్స్ లో లేదు..
Updated : Sep 7, 2023
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ఖుషి'. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి.. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. గత శుక్రవారం (సెప్టెంబర్ 1)న ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ఖుషి'.. ఫస్ట్ వీకెండ్ లో మంచి కలెక్షన్స్ నే రాబట్టింది. అయితే, సోమవారం నుంచి ఈ సినిమా వసూళ్ళ పరంగా తిరోగమన బాట పట్టింది.
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం రూ. 1.05 కోట్ల షేర్ వసూళ్ళు ఆర్జించిన ఖుషి.. మంగళవారం రూ. 75 లక్షల షేర్ చూసింది. ఇక ఆరో రోజైన నిన్న (బుధవారం) కేవలం రూ. 47 లక్షల షేర్ చూసింది. ఇక వరల్డ్ వైడ్ గా రూ. 53.50 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన 'ఖుషి'.. ఈ 6 రోజులకి గానూ రూ. 37. 69 కోట్ల షేర్ చూసింది. ఓవరాల్ గా.. 70 శాతం+ రికవరీ అయిందన్నమాట.
'ఖుషి' 6 రోజుల కలెక్షన్స్ వివరాలు:
నైజాం: రూ.12.55 కోట్ల షేర్
సీడెడ్ : రూ.2.19 కోట్ల షేర్
ఆంధ్రా: రూ.8.45 కోట్ల షేర్
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్స్ : రూ.23.19 కోట్ల షేర్
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా: రూ.6.05 కోట్ల షేర్
ఓవర్సీస్: రూ.8.45 కోట్ల షేర్
ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల కలెక్షన్స్ : రూ.37.69 కోట్ల షేర్