English | Telugu
'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'.. ఈ ఓటీటీలో చూడొచ్చు..!
Updated : Sep 7, 2023
స్వల్ప విరామం అనంతరం లేడీ సూపర్ స్టార్ అనుష్కా శెట్టి నటించిన చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్పొలిశెట్టి'. 'జాతిరత్నాలు' వంటి బ్లాక్ బస్టర్ తరువాత నవీన్ పొలిశెట్టి ఇందులో హీరోగా నటించాడు. 'రా రా కృష్ణయ్య' ఫేమ్ పి. మహేశ్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మించింది. రథన్ బాణీలు, గోపీసుందర్ నేపథ్య సంగీతం అందించిన 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' .. గురువారం (సెప్టెంబర్ 7) థియేటర్స్ లోకి వచ్చింది. ఓవరాల్ గా.. పాజిటివ్ టాక్ నే తెచ్చుకుంది.
ఇదిలా ఉంటే, 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' ఏ ఓటీటీ వేదికలో స్ట్రీమ్ కాబోతుందో సినిమా టైటిల్స్ లో క్లారిటీ ఇచ్చేశారు. దిగ్గజ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ ద్వారా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి స్ట్రీమ్ కానుంది. బహుశా వచ్చే నెలలో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఎంటర్టైన్ చేసే అవకాశముంది. త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన వస్తుంది. ఏదేమైనా.. థియేటర్స్ లో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ని మిస్ అయిన వాళ్ళు నెట్ ఫ్లిక్స్ లో చూసి తరించవచ్చన్నమాట.