English | Telugu
'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' పబ్లిక్ టాక్.. నవీన్ రాక్స్, అనుష్క షాక్స్..!
Updated : Sep 7, 2023
కాంబినేషన్ తోనే ఆడియన్స్ ఎటెన్షన్ పొందిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. లేడీ సూపర్ స్టార్ అనుష్క, యంగ్ సెన్సేషన్ నవీన్ పొలిశెట్టి తొలిసారిగా కలిసి నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. 2014లో రిలీజైన 'రారా కృష్ణయ్య'తో దర్శకుడైన పి. మహేశ్ బాబు.. భారీ విరామం అనంతరం మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన మూవీ ఇది. ప్రచార చిత్రాలతో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా.. గురువారం (సెప్టెంబర్ 7) థియేటర్స్ బాట పట్టింది.
ఇక ఈ మూవీ గురించి పబ్లిక్ టాక్ ఏంటంటే.. నవీన్ పొలిశెట్టి తన యాక్టింగ్ తో సినిమాని నిలబెట్టాడని చెప్పుకుంటున్నారు. స్టాండప్ కామెడీతో మెస్మరైజ్ చేసిన నవీన్.. పాత్రకు తగ్గ అభినయంతో పలు సన్నివేశాల్లో మెప్పించాడు. అయితే, అనుష్క మాత్రం పాత్ర పరంగా కొన్ని లిమిటేషన్స్ ఉండడంతో మరీ నవ్వించలేదు, మరీ ఏడిపించలేదు. కాకపోతే, సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇది ఒకరకంగా అభిమానులను నిరాశపరిచే అంశమంటున్నారు. పాటలు నిరాశపరిచినా.. నేపథ్య సంగీతం బాగుందంటున్నారు. విజువల్స్, నిర్మాణ విలువలు బాగున్నాయంటున్నారు. దర్శకుడు మహేశ్ ఎంచుకున్న కథ బోల్డ్ పాయింట్ తో ముడిపడినా.. తెరకెక్కించిన విధానం డీసెంట్ గా ఉందంటున్నారు. ఓవరాల్ గా.. చూడదగ్గ సినిమానే అని చెప్పుకుంటున్నారు.