English | Telugu
అనుష్కతో గొడవ.. అసలు నిజం ఇదే!
Updated : Sep 7, 2023
ఒక సినిమా సూపర్‌హిట్ అయ్యింది, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది అంటే దానికి అనేక కారణాలు వుంటాయి. కథ, హీరోహీరోయిన్లు, డైరెక్టర్ టేకింక్... ఇలా కారణం ఏదైనా కావచ్చు. కానీ, అన్నింటినీ మించి సినిమాని సరైన పద్ధతిలో ప్రమోట్ చేస్తే థియేటర్లకు జనం వస్తారు. దాని ఫలితం ఏమిటనేది వాళ్ళే నిర్ణయిస్తారు. అయితే కొన్ని సినిమాలకు సరైన ప్రమోషన్ లేక ఓపెనింగ్స్ కూడా వుండవు. ఆ సినిమా రిలీజ్ అవుతున్నట్టు కూడా చాలా మందికి తెలీదు. ఈమధ్యకాలంలో సరైన ప్రమోషన్ లేని సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్కతోపాటు నవీన్ పొలిశెట్టి కూడా నటించాడు. అయితే సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసినప్పటి నుంచి నవీన్ పొలిశెట్టి ఒక్కడే ప్రమోషన్స్‌లో కనిపించాడు. అందులో భాగంగా పలు నగరాల్లో ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయి సినిమా గురించి ప్రమోట్ చేశాడు. ఒక స్టార్ హీరోయిన్ నటించిన సినిమాకి సంబంధించిన ప్రమోషన్‌లో ఆ హీరోయిన్ కనిపించకపోవడం, ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వకపోవడంతో పలు ఊహాగానాలు వినిపించాయి. ఇందులో హీరోగా నటించిన నవీన్ పొలిశెట్టితో అభిప్రాయ భేదాలు రావడం వల్ల అనుష్క ప్రమోషన్స్‌కి రాలేదని కొందరు, చిత్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్‌తో గొడవలున్నాయని కొందరు.. ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. అయితే అనుష్క సినిమా రిలీజ్‌కి ముందు ఎక్కడా కనిపించకపోవడానికి గల కారణం తెలిసింది. ఈమధ్య అనుష్క లావుగా కనిపిస్తోంది. ఆ కారణంతోనే ప్రమోషన్స్‌కి రావడం లేదని తెలుస్తోంది. విఎఫ్‌ఎక్స్ ప్రక్రియ ద్వారా సినిమాలో అనుష్క స్లిమ్‌గా కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీని కోసం రూ.4.5 కోట్లు ఖర్చు పెట్టారట. సినిమాలో స్లిమ్‌గా కనిపిస్తూ, బయట హెవీ వెయిట్‌తో కనిపిస్తే బాగుండదన్న ఉద్దేశంతోనే ఈ సినిమా ప్రమోషన్స్‌కి అనుష్క దూరంగా వుందట. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు వచ్చిన రకరకాల రూమర్లకు ఈ వార్త ఫుల్‌స్టాప్ పెట్టింది.