English | Telugu
'జవాన్' ఏ ఓటీటీలో రాబోతుందో తెలుసా..!
Updated : Sep 7, 2023
'పఠాన్' వంటి సెన్సేషనల్ మూవీ తరువాత బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన సినిమా 'జవాన్'. కోలీవుడ్ కెప్టెన్ అట్లీ ఈ మూవీతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు.. దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతారకి కూడా ఇదే తొలి హిందీ సినిమా. విజయ్ సేతుపతి ఇందులో విలన్ గా నటించాడు.యువ సంగీత సంచలనం అనిరుథ్ బాణీలు కట్టిన ఈ బిగ్ టికెట్ మూవీ.. గురువారం (సెప్టెంబర్ 7) థియేటర్స్ లోకి వచ్చింది. ఓవరాల్ గా.. మంచి టాక్ నే తెచ్చుకుంది.
ఇదిలా ఉంటే, 'జవాన్' ఏ ఓటీటీ వేదికలో స్ట్రీమ్ కాబోతుందో సినిమా టైటిల్స్ లో క్లారిటీ ఇచ్చేశారు. దిగ్గజ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ ద్వారా జవాన్ స్ట్రీమ్ కానుంది. బహుశా వచ్చే నెలలో 'జవాన్' ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఎంటర్టైన్ చేసే అవకాశముంది. త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన వస్తుంది. ఏదేమైనా.. థియేటర్స్ లో 'జవాన్'ని మిస్ అయిన వాళ్ళు నెట్ ఫ్లిక్స్ లో చూసి తరించవచ్చన్నమాట.