English | Telugu
పెళ్లి మీద మనసు మళ్లింది.. ప్రభాస్ తో అట్లుంటది!
Updated : Sep 6, 2023
'కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు' అంటారు. ఇదే విషయాన్ని గుర్తు చేసిన అనుష్క శెట్టి.. తనకు పెళ్లి చేసుకోవాలనే ఉందని, కానీ ఆ టైం రావాలని అంటున్నారు.
అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి జంటగా పి. మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీ రేపు(సెప్టెంబర్ 7న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క.. పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు పెళ్లి చేసుకోవాలనే ఉందని, కానీ అదేదో అంటారు కదా.. కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అని.. ఆ టైం రావాలని అనుష్క అన్నారు.
ఇక ఈ సినిమాలో చెఫ్ పాత్ర పోషించిన అనుష్క.. తెలుగు వంటకాల్లో తనకు ముద్దపప్పు-ఆవకాయ, రొయ్యలు ఇష్టమని చెప్పారు. అయితే తాను తన ఫ్రెండ్స్ ప్రభాస్, ప్రమోద్ లాగా ఫుడీ కాదని, అయినా వారితో ఫ్రెండ్ షిప్ ఉంటే ఫుడీలు కూడా ఫుడ్ మానేస్తారు, వాళ్ళ వ్యవహారం అలా ఉంటుంది అంటూ మిర్చి షూటింగ్ టైంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. మిర్చి టైంలో లావిష్ బ్రేక్ ఫాస్ట్ ఉండేది, అది అవుతుండగానే లంచ్ గురించి డిస్కషన్ జరిగేది అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి మిర్చి టైంలో అనుష్కని ప్రభాస్ ఫుడ్ తో భయపెట్టారని అర్థమవుతోంది. ఇక ప్రభాస్ తో మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకోవడంపై స్పందించిన అనుష్క.. ప్రభాస్ తో సినిమా చేయడానికి ఎప్పుడు రెడీనే అని, కానీ సరైన స్క్రిప్ట్ దొరకాలి కదా అన్నారు.