English | Telugu

‘7/G బృందావన్ కాలనీ’ వివాదం.. డైరెక్టర్‌కి బెదిరింపులు

తమిళ చిత్రాలతో పాపులారిటీ సంపాదించుకున్న నటి సోనియా అగర్వాల్ కొన్నేళ్లకు దర్శకుడు సెల్వ రాఘవన్‌ను పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్లకు ఇద్దరూ విడిపోయారు కూడా. ప్రస్తుతం ఆమె మళ్లీ సినిమాలతో బిజీగా మారటానికి గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఆమె 7G అనే చిత్రంలో నటించారు. ఇందులో ఆమె దెయ్యం పాత్రలో కనిపించనున్నారు. వెంకట్, శ్రుతి ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి హారూన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ హారర్ మూవీ టైటిల్ ఇప్పుడు డైరెక్టర్‌కి ఇబ్బందిగా మారింది. 7G టైటిల్‌ను పెట్టొద్దని డైరెక్టర్ హరూన్‌కి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ విషయాన్ని ఆయనే తెలియజేశారు.

7G టైటిల్ ఇలా వివాదంగా మారటంపై డైరెక్టర్ హరూన్ వివరణ ఇచ్చుకున్నారు. సినిమా కథంతా 7G అనే ఇంట్లో నడుస్తుంది. అలాగే ఈ టైటిల్‌ను ఎవరు రిజిష్టర్ చేయకపోవటంతోనే తాము రిజిష్టర్ చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే టైటిల్ పెట్టొద్దని బెదిరిస్తున్నారని, అలాంటి చర్యలకు తాము భయపడటం లేదని,టైటిల్ మార్చే ప్రసక్తే లేదు..చట్టపరంగా సమస్యను పరిష్కరించుకుంటామని ఆయన పేర్కొన్నారు. 7G అనే టైటిల్ అంతకు ముందు సోనియా అగర్వాల్ నటించిన 7/G బృందావన్ కాలనీ అనే టైటిల్‌కి దగ్గరగా ఉండటమే అందుకు కారణమని తెలుస్తోంది.

నటిగా మంచి అవకాశాలను దక్కించుకుంటోన్న సమయంలోనే సోనియా అగర్వాల్ డైరెక్టర్ సెల్వ రాఘవన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత ఆమె మనస్పర్దలతో ఆయన్నుంచి విడిపోయారు. తర్వాత సినిమాల్లో నటిస్తున్నారు. కీలక పాత్రల్లో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు సెల్వ రాఘవన్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని తండ్రయ్యారు. రీసెంట్ టైమ్‌లో 7/G బృందావన్ కాలనీ సినిమాకు సీక్వెల్‌ను రూపొందిస్తున్నట్లు వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.