English | Telugu
గుడిలో రజినీకాంత్... షర్ట్‌కి జేబు లేదు!
Updated : Sep 9, 2023
సూపర్‌స్టార్ రజినీకాంత్ ఇప్పుడు జైలర్ మూవీ ఇచ్చిన సక్సెస్ మూవీ ఊపులో ఉన్నారు. ఇదే సందర్భంలో ఆయన పలు ఆలయాలను సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్స్, ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసా..గుడికి వెళ్లిన రజినీకాంత్ దైవ దర్శనం తర్వాత తన చొక్కా మడతలో నుంచి డబ్బులు తీసి దక్షిణ వేశారు. ఇలా ఒక తలైవర్ మాత్రమే చేయగలరు అంటూ కొందరు వీడియోను షేర్ చేస్తున్నారు.
అయితే కొందరు నెటిజన్స్ మాత్రం రజినీకాంత్ ఇలా చేస్తారు? అని అంటున్నారు. దానికి రజినీ వేసుకున్న షర్ట్‌కి జేబు లేదు. అందుకనే ఆయన చొక్కా చేతి మడతలో డబ్బులు తీసుకుని వచ్చి దక్షిణ వేశారని ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు. 80లలో అంతకు ముందున్నవారు చాలా మంది ఇలా మడతల్లో డబ్బులు పెట్టుకునేవారని దీనిపై కామెంట్స్ చేయటం సరికాదని కూడా అనేవారు లేకపోలేదు. ఏదైతేనేం తలైవర్ ఏది చేసినా ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు మరి.
ఇప్పుడు తలైవర్ తన 170వ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ సినిమాను జై భీమ్ ఫేమ్ టి.జి.జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో రజినీకాంత్‌తో పాటు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి తోపాటు మంజు వారియర్ కూడా ఆకట్టుకోబోతున్నారు. ఈ చిత్రంలో ఆయన ఫేక్ ఎన్‌కౌంటర్స్ మీద పోరాటం చేసే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. దీని తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఓ సినిమా తెరకెక్కనుంది.