English | Telugu

చూడబోతే కొట్టేలా ఉన్నారు.. 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' 2 రోజుల కలెక్షన్స్!


లేడీ సూపర్ స్టార్ అనుష్కా శెట్టి, టాలెంటెడ్ స్టార్ నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. 'రారా కృష్ణయ్య' ఫేమ్ పి. మహేశ్ బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని.. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మించింది. గురువారం (సెప్టెంబర్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి.. డివైడ్ టాక్ వచ్చింది.

కాగా, రూ. 13.50 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ తో బాక్సాఫీస్ ముంగిట నిలిచిన 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'.. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రూ. 2. 70 కోట్ల షేర్ ని ఆర్జించింది. ఇక రెండో రోజైన శుక్రవారం రూ. 2.56 కోట్ల షేర్ వచ్చింది. అంటే.. మొత్తంగా రెండు రోజుల్లో రూ. 5.26 కోట్ల షేర్ ఆర్జించిందీ సినిమా. ఇక రికవరీ పరంగా చూస్తే దాదాపు 39 శాతం చూసిందనే చెప్పాలి. శని, ఆది వారాల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగి మంచి వసూళ్ళు వస్తే గనుక.. మిస్ శెట్టి అండ్ మిస్టర్ పొలిశెట్టి హిట్ కొట్టబోతున్నట్లే చెప్పొచ్చు. మరి.. చూద్దాం ఏం జరుగుతుందో?

'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' 2 రోజుల కలెక్షన్స్ వివరాలు:
నైజాం: రూ. 1.48 కోట్ల షేర్
సీడెడ్ : రూ. 21 లక్షల షేర్
ఆంధ్రా: రూ.87 లక్షల షేర్

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్స్ : రూ.2.56 కోట్ల షేర్
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా: రూ. 30 లక్షల షేర్
ఓవర్సీస్: రూ.2.40 కోట్ల షేర్

ప్రపంచవ్యాప్తంగా 2 రోజుల కలెక్షన్స్ : రూ.5.26 కోట్ల షేర్

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.