English | Telugu

క్రిష్‌ చేతుల మీదుగా 'ద్రోహి' ఫస్ట్‌ లుక్‌ లాంచ్‌

సందీప్‌ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ జంటగా గుడ్‌ ఫెల్లోస్‌ మీడియా ప్రొడక్షన్స్‌, సఫైరస్‌ మీడియా, వెడ్‌నెస్‌డే ఎంటర్టైన్మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ద్రోహి'. ది క్రిమినల్‌ అన్నది ఉపశీర్షిక. క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి విజయ్‌ పెందుర్తి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్‌ రెడ్డి, విజయ్‌ పెందుర్తి, రాజ శేఖర్ అర్ నిర్మాతలు. ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను తాజాగా ప్రముఖ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి విడుదల చేశారు.

ఈ సందర్భంగా క్రిష్‌ మాట్లాడుతూ "సినిమాకు సంబంధించిన లుక్‌, గ్లింప్స్‌ చూశాను. చాలా ప్రామిసింగ్‌గా ఉంది. చక్కని తారాగణం ఈ చిత్రానికి పని చేశారు. ఈ సినిమాకు చక్కని విజయాన్ని సాధించి సినిమాకు పని చేసిన నటీనటులు, సాంకేతికి నిపుణులు అందరూ మంచి పేరు తెచ్చుకుని సినిమా రంగంలో నిలదొక్కుకోవాలని ఆశిస్తున్నారు. టీమ్‌ అందరికీ శుభాకాంక్షలు" అని అన్నారు.

దర్శకనిర్మాతలు మాట్లాడుతూ "చక్కని థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు చిత్రంలో ఉంటాయి. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కావొచ్చాయి. ఇదే నెలలో సినిమాను విడుదల చేస్తాం" అని తెలిపారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.