English | Telugu
'జవాన్' తొలి రోజు కలెక్షన్స్.. బాక్సాఫీస్ ని షేక్ చేసిన షారుక్!
Updated : Sep 8, 2023
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మరోసారి బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తున్నాడు. ఏడాది ప్రారంభంలో 'పఠాన్'గా సెన్సేషన్ క్రియేట్ చేసిన షారుక్.. తాజాగా 'జవాన్'గా పలకరించాడు. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ సినిమాలో కింగ్ ఖాన్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఇందులో నాయికగా నటించింది. కాగా, గురువారం (సెప్టెంబర్ 7) జనం ముందు నిలిచిన 'జవాన్'.. విడుదలైన అన్ని చోట్ల వసూళ్ళ వర్షం కురిపిస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా తొలిరోజు రూ. 126. 40 కోట్ల గ్రాస్ ఆర్జించింది.
ఏరియాల వారిగా 'జవాన్' ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు:
తెలుగు రాష్ట్రాలు: రూ.9.40 కోట్ల గ్రాస్
తమిళనాడు : రూ.7.40 కోట్ల గ్రాస్
కర్ణాటక: రూ. 7.25 కోట్ల గ్రాస్
కేరళ: రూ. 3.50 కోట్ల గ్రాస్
రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ. 61. 05 కోట్ల గ్రాస్
ఓవర్సీస్: రూ.37.80 కోట్ల గ్రాస్
ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే కలెక్షన్స్ : రూ.126.40 కోట్ల గ్రాస్
హిందీ డే 1 నెట్: రూ. 65. 50 కోట్లు