English | Telugu

లంకలో రామ్‌ పెళ్ళి... డేట్‌ ఫిక్స్‌! 

దగ్గుబాటి కుటుంబంలో పెళ్ళి పనులు మొదలయ్యాయి. నిర్మాత సురేష్‌బాబు రెండో తనయుడు అభిరామ్‌ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. సురేష్‌బాబుకు మేనకోడలు వరసయ్యే అమ్మాయితో అభిరామ్‌ పెళ్ళిని ఫిక్స్‌ చేశారు. దగ్గుబాటి సొంత ఊరైన కారంచేడులో అమ్మాయి కుటుంబం ఉంటుందని తెలిసింది. అభిరామ్‌, ఆ అమ్మాయి చిన్నతనం నుంచి ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారని, వారిద్దరికీ పెళ్లి చెయ్యాలన్నదే దివంగత రామానాయుడు కోరిక అని తెలుస్తోంది. అయితే వీరిద్దరి వివాహం ఇండియాలో జరగడం లేదని సమాచారం. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌గా శ్రీలంకలో ప్లాన్‌ చేస్తున్నారు. డిసెంబర్‌ 6న ఈ వివాహ జరగనుంది. ఇప్పటికే శుభలేఖల పనిలో ఉన్నారు కుటుంబ సభ్యులు.

అభిరామ్‌ నటుడిగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ‘అహింస’ చిత్రంలో హీరోగా నటించాడు. ఇప్పుడు కొత్తగా ఓ కాఫీ షాప్‌ ఓపెన్‌ చేస్తున్నాడు. ‘రైటర్స్‌ కాఫీ షాప్‌’ పేరుతో హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో పక్కనే ఓ షాప్‌ను స్టార్ట్‌ చెయ్యబోతున్నాడు. సాధారణంగా చాలా సినిమాలకు సంబంధించిన డిస్కషన్స్‌ ఎక్కువగా కాఫీ షాపుల్లోనే జరుగుతుంటాయి. ఇప్పుడు అభిరామ్‌ ఓపెన్‌ చేస్తున్న కాఫీ షాప్‌ దానికి బాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో దాన్ని స్టార్ట్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.