English | Telugu

"గురువుగారూ అంటూనే".. మళ్ళీ వస్తున్న చారి, భట్టు!

చారి, భట్టు.. ఈ పేర్లు వినగానే ఎవరికైనా సరే పెదాలపై నవ్వులు విరబూయాల్సిందే. అంతగా.. తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయిన పేర్లివి. 'అదుర్స్' సినిమాలో ఈ గురుశిష్యుల జంట చేసిన సందడి.. ఆ చిత్రానికేఎస్సెట్ గా నిలిచింది. ఇందులో చారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, భట్టుగా కామెడీ కింగ్ బ్రహ్మానందం తమ యాక్టింగ్ తో ఇచ్చిపడేశారు. మరీ ముఖ్యంగా.. "గురువుగురూ" అంటూ మొదలయ్యే సన్నివేశాల్లో ఇద్దరి టైమింగ్ అదుర్స్ అనే చెప్పాలి.

ఇదిలా ఉంటే, చారి - భట్టు కాంబో మరోసారి ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే, సీక్వెల్ అనుకునేరు. కానేకాదు.. ప్రస్తుతం నడుస్తున్న రిరిలీజ్ ట్రెండ్ ప్రకారం మళ్ళీ బిగ్ స్క్రీన్ పై ఈ మాస్ ఎంటర్టైనర్ మళ్ళీవినోదాలు పంచనుందట. అన్నీ కుదిరితే, దీపావళి కానుకగా నవంబర్ రెండో వారంలో 'అదుర్స్' రిరిలీజ్ అయ్యే అవకాశముందంటున్నారు. త్వరలోనే రిరిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.

కాగా, 'అదుర్స్'లో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయగా నయనతార, షీలా హీరోయిన్లుగా నటించారు. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు కట్టారు. 2010 సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం.. ఆ ఏడాది పొంగల్ విన్నర్ గా నిలిచింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.