English | Telugu

హ్యాట్రిక్ హీరోల లిస్ట్ లో.. నవీన్ పొలిశెట్టి!

తెలుగునాట హ్యాట్రిక్ కొట్టిన హీరోలు చాలామందే ఉన్నారు. ఈ జాబితాలో తాజాగా మరో హీరో కూడా చేరాడు. ఆ కథానాయకుడు మరెవరో కాదు.. యంగ్ సెన్సేషన్ నవీన్ పొలిశెట్టి.

ఆ వివరాల్లోకి వెళితే.. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' మూవీతో యాక్టర్ గా తెరంగేట్రం చేసిన నవీన్ పొలిశెట్టి.. ఆపై 'డి ఫర్ దోపిడి', సూపర్ స్టార్ మహేశ్ బాబు '1 నేనొక్కడినే' సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో అలరించాడు. 2019లో విడుదలైన 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో హీరోగా ప్రయాణం మొదలు పెట్టిన నవీన్.. కథానాయకుడిగా మొదటి ప్రయత్నంలోనే మంచి విజయం సాధించాడు. ఆనక 2021లో వచ్చిన 'జాతిరత్నాలు'తో సంచలన విజయం అందుకున్నాడు.

కట్ చేస్తే.. తాజాగా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో పలకరించిన నవీన్ కి.. ఈ సినిమా కూడా మంచి ఫలితాన్నే అందిస్తోంది. డివైడ్ టాక్ తో జనం ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రెండు రోజుల్లో బాగానే వసూళ్ళు చూసింది. శని, ఆది వారాల్లోనూ ఇదే ఊపు కొనసాగితే.. 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' హిట్ లిస్ట్ లో చేరడం ఖాయమంటున్నారు ట్రేడ్ పండితులు. ఏదేమైనా.. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతిరత్నాలు', 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'.. ఇలా రెండేళ్ళకో హిట్ సినిమాతో సందడి చేసి 'హ్యాట్రిక్ హీరో' ట్యాగ్ ని సొంతం చేసుకున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. మరి.. రాబోయే చిత్రాలతోనూ ఇదే జోరుని కొనసాగిస్తాడేమో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.