English | Telugu
‘భోళా శంకర్’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే!
Updated : Sep 10, 2023
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. ఆగస్ట్ 11న విడుదలైంది. మెహర్ రమేష్ ఈ సినిమాను తెరకెక్కించారు. తమన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటించింది. సినిమాపై ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. నెట్టింట ట్రోలింగ్ కూడా జరిగింది. థియేటర్స్‌లో రాణించని ఈ సినిమాను ఇప్పుడు మేకర్స్ ఓటీటీలో రిలీజ్ చేయటానికి రెడీ అయ్యారు. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు సెప్టెంబర్ 15 నుంచి ‘భోళా శంకర్’ సినిమా ప్రముఖ ఓటీటీ ఛానెల్ అయిన నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. సిల్వర్ స్క్రీన్ మీద సత్తా చాటని ఈ మెగా సినిమా ఇప్పుడు ఓటీటీలో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.
తమిళ చిత్రం వేదాళం రీమేక్‌గా ‘భోళా శంకర్’ను తెరకెక్కించారు. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సినిమా ఉంటుంది. తన కారణంగా కుటుంబాన్ని పోగొట్టుకున్న అమ్మాయికి అన్నయ్యగా మారుతాడో గ్యాంగ్ స్టర్. తను విలన్స్ భరతం ఎలా పట్టాటనేదే సినిమా కథాంశం. తెలుగులో సినిమాను చాలా పెద్ద రేంజ్‌లో తెరకెక్కించారు. భారీ సెట్స్, తారాగణం నటించారు. ఈ ఏడాది జనవరిలో వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ సాధించిన చిరంజీవి.. అదే నమ్మకంతో భోళా శంకర్‌ను ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు. కానీ సినిమా నిరాశ పరిచింది.
ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర ఈ సినిమాను రూపొందించారు. సినిమా నష్టాలను చవి చూసింది. పదేళ్ల తర్వాత మెగాఫోన్ పట్టిన మెహర్ రమేష్‌కు ‘భోళా శంకర్’ ఫ్లాప్ గట్టి ఎదురు దెబ్బగా నిలిచింది. చిరంజీవి వెంటనే తన నెక్ట్స్ సినిమాను స్టార్ట్ చేయకుండా మోకాలి ఆపరేషన్ చేయించుకున్నారు. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు. త్వరలోనే కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు మరి.