English | Telugu
మళ్ళీ వస్తున్న 'బిచ్చగాడు'.. రిరిలీజ్ కి డేట్ ఫిక్స్!
Updated : Sep 9, 2023
ఏడేళ్ళ క్రితం తెలుగునాట సంచలనం సృష్టించిన అనువాద సినిమా 'బిచ్చగాడు'. తమిళంలో 'పిచ్చైకారన్' పేరుతో తెరకెక్కిన ఈ మదర్ సెంటిమెంట్ మూవీ.. తెలుగు రాష్ట్రాల్లోనూ వసూళ్ళ వర్షం కురిపించింది. కథానాయకుడిగా విజయ్ ఆంటోని మార్కెట్ అమాంతం పెంచింది. ఇక ఈ ఏడాది వేసవిలో ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన 'బిచ్చగాడు 2' కూడా బాక్సాఫీస్ ని షేక్ చేసింది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం రిరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న తరుణంలో 'బిచ్చగాడు'ని కూడా మళ్ళీ తెరపైకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న బిచ్చగాడుకి రిరిలీజ్ డేట్ గా ఫిక్స్ చేశారని తెలిసింది. మరి.. ఏడేళ్ళ క్రితం అఖండ విజయం సాధించిన బిచ్చగాడు.. రిరిలీజ్ లోనూ కాసుల వర్షం కురిపిస్తుందేమో చూడాలి.