English | Telugu
‘సలార్’ కొత్త రిలీజ్ డేట్!
Updated : Sep 10, 2023
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టైటిల్ పాత్రధారిగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సలార్’. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రం సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కాకపోవటంతో మేకర్స్ ‘సలార్’ను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు కానీ.. చాలా సినిమాలు అదే రోజున వస్తున్నట్లు ప్రకటనలు ఇచ్చుకోవటం చూసి అందరూ ఫిక్స్ అయిపోయారు. సలార్ వాయిదా డార్లింగ్ ఫ్యాన్స్‌ని తీవ్రంగా నిరాశ పరిచింది.
ఇప్పుడు ‘సలార్’ విషయంలో అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోన్న ప్రశ్న.. ఈ మూవీ నెక్ట్స్ రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందనేదే. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న న్యూస్ ప్రకారం క్రిస్మస్ సందకర్భంగా డిసెంబర్ 21 న ‘సలార్’ను విడుదల చేయాలని అనుకుంటున్నారు. అందుకు కారణం.. వీకెండ్‌తో పాటు క్రిస్మస్ సెలవులు కూడా కలిసి వస్తాయని భావిస్తున్నారు. డిసెంబర్ 21న గురువారం.. డిసెంబర్ 22 శుక్రవారం.. డిసెంబర్ 23 శనివారం.. డిసెంబర్ 24 ఆదివారం.. డిసెంబర్ 25 సోమవారం క్రిస్మస్ ఉంటుంది. డిసెంబర్ 31.. ఏడాది చివరి రోజు.. ఆ మరుసటి రోజు కొత్త ఏడాది ప్రారంభం అవుతుంది.. ఈ లెక్కలన్నీ వేసుకునే ‘సలార్’ నిర్మాతలు సినిమాను డిసెంబర్ 21న టార్గెట్ చేశారు.
‘సలార్’ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే.. బాహుబలి తర్వాత సాలిడ్ మాస్ యాక్షన్ మూవీ పడలేదు. పడితే ఎలా ఉంటుందో బాక్సాఫీస్‌కి రుచి చూపించాలని అందరూ సలార్ కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. కె.జి.యఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. శ్రుతీ హాసన్ ఇందులో హీరోయిన్. రెండు బాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమాలో సలార్ సీజ్ ఫైర్ పేరుతో పార్ట్ 1న రెడీ అవుతోంది.