English | Telugu
రికార్డ్స్ వేట షురూ చేసిన దళపతి విజయ్
Updated : Sep 10, 2023
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తాజా చిత్రం ‘లియో’ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. దసరా సందర్భంగా ఈ సినిమాను అక్టోబర్ 19న భారీ ఎత్తున విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో ప్రొడ్యూసర్‌కి బాగానే ప్రాఫిట్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు ఇంకా 40 రోజులకు పైగానే సమయం ఉంది. అయితే ఇప్పటి నుంచి వసూళ్ల పరంగా దళపతి విజయ్ తన ‘లియో’ రికార్డుల వేటను షురూ చేశారు.
అదేంటి అప్పుడే కలెక్షన్స్ పరంగా ‘లియో’ రికార్డులు క్రియేట్ చేయటమేంటనే అనుమానం రావచ్చు. వివరాల్లోకి వెళితే.. విజయ్ రికార్డుల వేటను మొదలు పెట్టింది ఈసారి ఇండియాలో కాదు.. యునైటెడ్ కింగ్‌డమ్‌లో. ఈ మూవీని యు.కెలో అహింస ఎంటర్‌టైన్‌మెంట్ అనే సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. రైట్స్‌ను ఇలా సొంతం చేసుకున్నారో లేదో సదరు సంస్థ అప్పుడు యు.కెలో అడ్వాన్స్ బుకింగ్స్‌ను స్టార్ట్ చేసేసింది. అలా బుకింగ్స్ షురూ చేశారో లేదో.. 24 గంటల్లోనే ‘లియో’ సినిమా పదివేల టికెట్లు అమ్ముడయ్యాయి. రెండు లక్షల పౌండ్స్ వసూళ్లను సినిమా టచ్ చేసింది. అంటే మన కరెన్సీ లెక్కల ప్రకారం ఇది కోటి రూపాయలకు పైగానే ఉంటుంది.
ఇప్పుడే ‘లియో’ సినిమాపై ఇంత క్రేజ్ ఉంటే ఇంకా ట్రైలర్, సాంగ్స్ వచ్చిన తర్వాత ఏ రేంజ్‌కు పెరుగుతాయో ఊహించుకోవచ్చు. ఈ మూవీని తమిళం, తెలుగులోనే కాకుండా హిందీలోనూ రిలీజ్ చేయటానికి మేకర్స్ ఇప్పటి నుంచే సన్నాహాలు చేసుకుంటున్నారు. మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో ‘లియో’ సినిమా తెరకెక్కింది. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్రిష ఇందులో హీరోయిన్‌గా నటించింది. అక్టోబర్ నెలలోనే విజయ్ తన 68వ సినిమా షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేయబోతున్నారు. దీనికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఇది పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుందని టాక్.